MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dartyhari2f895717-6059-46fc-9dec-64c89a7153e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dartyhari2f895717-6059-46fc-9dec-64c89a7153e8-415x250-IndiaHerald.jpgప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు అంటేనే భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. అయితే అలాంటి నిర్మాత, దర్శకుడిగా ఒక బూతు సినిమా ‘డర్టీ హరి’ తీశాడు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ హీరో హీరోయిన్లు. ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ఏటిటి యాప్ ద్వారా విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.. ఒక్కమాటలో బూతు సినిమాకు తక్కువ, సీరియల్ బోల్డ్ డ్రామాకి ఎక్కువ అన్నట్టు ఉంది ఈ సినిమా అవుట్ ఫుట్. dartyhari;hari;hari music;jasmine;prema;sravan kumar;cinema;producer;love;job;producer1;hero;romantic;reddy;masala;mass;iddarammailathoమాస్ మసాలా మూవీ డర్టీ హరిమాస్ మసాలా మూవీ డర్టీ హరిdartyhari;hari;hari music;jasmine;prema;sravan kumar;cinema;producer;love;job;producer1;hero;romantic;reddy;masala;mass;iddarammailathoSun, 20 Dec 2020 09:58:34 GMTమాస్ మసాలా మూవీ డర్టీ హరి

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు అంటేనే భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. అయితే అలాంటి నిర్మాత, దర్శకుడిగా ఒక బూతు సినిమా ‘డర్టీ హరి’  తీశాడు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ హీరో హీరోయిన్లు. ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ఏటిటి యాప్ ద్వారా విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.. ఒక్కమాటలో బూతు సినిమాకు తక్కువ, సీరియల్ బోల్డ్ డ్రామాకి ఎక్కువ అన్నట్టు ఉంది ఈ సినిమా అవుట్ ఫుట్.  

కథ విషయానికి వస్తే.. హ‌రి (శ్రవణ్‌ రెడ్డి) లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆశ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జాబ్ కోసం న‌గ‌రరానికి చేరుకుని ధ‌నవంతుల కుటుంబానికి చెందిన వ‌సుధ (రుహానీ శ‌ర్మ‌) అనే అమ్మాయిని ప్రేమ‌లో పడేసి.. ఆ రకంగా సెటిల్ అవుతాడు. కానీ ఇంత‌లో వ‌సుధ సోద‌రుడి ప్రియురాలైన జాస్మిన్ (సిమ్రత్‌ కౌర్‌)ని చూసి మనోడికి ప్రేమ పుట్టడం.. ఫలితంగా జాస్మిన్ గర్భవతి అవ్వడం జరిగిపోతాయి. ఈ డ్రామాలో ధ‌న‌వంతురాలైన వ‌సుధ నుంచి విడిపోలేడు, అలా అని గర్భవతి అయిన జాస్మిన్ బంధాన్ని అంత తేలిగ్గా వదిలించుకోలేడు. చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరగాయనేది ఈ సినిమా మిగిలిన బాగోతం.  

‘డర్టీ హరి’లో బోల్డ్ నెస్ తో పాటు మంచి కంటెంట్  ఉంది. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడనే కాన్సెప్ట్ తో సాగిన ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ తో పాటు హీరో పాత్రకు ఇద్దరమ్మాయిలతో ఏర్పడిన అనుబంధం తాలూకు సన్నివేశాలు, ముగ్గురి మధ్యన జరిగే డ్రామా అండ్ ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఇక హీరోగా నటించిన శ్రవణ్ రెడ్డి లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్రకు తగ్గట్లు చాలా ఫిట్ గా కనిపించాడు.  

కాగా ఓవరాల్ గా ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ డ్రామా యూత్ ను కొన్ని అంశాల్లో ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, అలాగే స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.  




బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>