PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-bjp-damage-to-pawan-kalyan2d588464-f615-4aa8-8733-749a1c2d8e62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-bjp-damage-to-pawan-kalyan2d588464-f615-4aa8-8733-749a1c2d8e62-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా బీజేపీ గ్రిప్‌లోకి వెళ్లిపోయారా? అంటే ప్రస్తుత పరిస్థితులని చూస్తే అవుననే అనుమానం రాక మానదు. ఎందుకంటే పవన్‌కు అంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. పవన్ ఎన్నికల్లో ఓటమి పాలైన, ఆయన అంటే అభిమానించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. అలాగే పవన్ ఏదైనా సమస్య మీద స్పందిస్తే, అది పాలకులు త్వరగా పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. ఓట్లు వేయకపోయిన సరే జనసేన పార్టీ అంటే ప్రజలకు ఓ మంచి నమ్మకమే ఉంది. pawan kalyan;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;2019;tirupati;bank;husband;janasena party;v;partyకమలం ఎత్తులు: పవన్‌కు దెబ్బ పడేది అక్కడేనా?కమలం ఎత్తులు: పవన్‌కు దెబ్బ పడేది అక్కడేనా?pawan kalyan;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;2019;tirupati;bank;husband;janasena party;v;partySun, 20 Dec 2020 01:00:00 GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా బీజేపీ గ్రిప్‌లోకి వెళ్లిపోయారా? అంటే ప్రస్తుత పరిస్థితులని చూస్తే అవుననే అనుమానం రాక మానదు. ఎందుకంటే పవన్‌కు అంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. పవన్ ఎన్నికల్లో ఓటమి పాలైన, ఆయన అంటే అభిమానించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. అలాగే పవన్ ఏదైనా సమస్య మీద స్పందిస్తే, అది పాలకులు త్వరగా పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. ఓట్లు వేయకపోయిన సరే జనసేన పార్టీ అంటే ప్రజలకు ఓ మంచి నమ్మకమే ఉంది.

కానీ ఆ నమ్మకం ఇప్పుడు పోతుందా? అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఏపీ ప్రజలు పవన్ పట్ల పెద్ద ఇంటరెస్ట్ చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా ఆయన సినిమాల్లో బిజీ అయిపోయి, అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. దీంతో ప్రజలు పవన్‌పై పెద్దగా ఆశ పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే బీజేపీ పొత్తు పెట్టుకుని జనసేన మరింత దిగజారుతుందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజలకు ఏ మాత్రం విశ్వాసం లేదు.

అందుకే దేశం మొత్తం కమలం జోరు కొనసాగిన ఏపీలో మాత్రం కష్టం. ఇక్కడ ప్రజలు ఇంకా కమలాన్ని ఆదరించడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. పైగా ఆ పార్టీకి ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. అలాంటి పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడం వల్ల, జనసేన ఓటు బ్యాంక్ కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేనకు 7 శాతం వరకు ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు ఆ ఓట్లు తగ్గినట్లే కనిపిస్తున్నాయి.

పైగా కమలం కొత్త ఎత్తులు వేస్తూ, జనసేననే డామినేట్ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో జనసేనని సైడ్ చేసి, బీజేపీ అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తున్నారు. ఇక బీజేపీ చెప్పినట్లు పవన్ వింటే, రాబోయే రోజుల్లో సొంత సామాజికవర్గం నుంచి కూడా దెబ్బ పడేలా ఉంది.




పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>