PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpgవీరిలో కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ ఉన్నారు. వీరంతా వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. టీడీపీ విధానాల‌కు దూరంగా ఉంటున్నారు. చంద్ర‌బాబు పిలుపు ఇస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. అలాగ‌ని అసెంబ్లీలోను, ఇటు అధికారికంగా కూడా వైసీపీ స‌భ్యులుగా చెప్పుకోవ‌డం లేదు. ఈ న‌లుగురు ఎమ్మెల్యేలు తాము వైసీపీ ఎమ్మెల్యేలం అని చెప్పుకుtdp chandra babu;vamsi;రాజీనామా;district;vishakapatnam;mla;letter;tdp;chirala;ycp;partyఆ న‌లుగురి విష‌యంలో.. బాబు ఇలా చేశారే..!ఆ న‌లుగురి విష‌యంలో.. బాబు ఇలా చేశారే..!tdp chandra babu;vamsi;రాజీనామా;district;vishakapatnam;mla;letter;tdp;chirala;ycp;partySun, 20 Dec 2020 17:49:22 GMTటీడీపీ నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కిన వారిలో న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే.. వీరు ఎక్క‌డా పార్టీ నుంచి అధికారికంగా దూరంగా లేరు. ప్ర‌స్తుతం అసెంబ్లీలోనూ వారు టీడీపీ స‌భ్యులుగానే చ‌లామ‌ణి అవుతున్నారు. అంతేకాదు, టీడీపీ స‌భ్యుల‌కు కేటాయించిన సీట్ల‌లోనే అసెంబ్లీలో ఆశీనుల‌వుతున్నారు. ఇక‌, ఆయా ఎమ్మెల్యేల లెట‌ర్ హెడ్‌ల‌పైనా టీడీపీ ఎమ్మెల్యే అనే ఉంటోంది. అయితే.. పార్టీకి, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. అంతే త‌ప్ప టెక్నిక‌ల్‌గా చూసుకున్నా.. అధికారికంగా చూసుకున్నా.. వారంతా టీడీపీ స‌భ్యులే..!

వీరిలో కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ ఉన్నారు. వీరంతా వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. టీడీపీ విధానాల‌కు దూరంగా ఉంటున్నారు. చంద్ర‌బాబు పిలుపు ఇస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు. అలాగ‌ని అసెంబ్లీలోను, ఇటు అధికారికంగా కూడా వైసీపీ స‌భ్యులుగా చెప్పుకోవ‌డం లేదు. ఈ న‌లుగురు ఎమ్మెల్యేలు తాము వైసీపీ ఎమ్మెల్యేలం అని చెప్పుకుంటే వారి స‌భ్య‌త్వాలు కోల్పోయే ప్ర‌మాదంతోపాటు.. అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం ఉంటుంది.

దీంతో ఆ న‌లుగురు ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వారు తీసుకుంటున్నారు. ఇక‌, చంద్ర‌బాబు కూడా వారిని త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేయ‌లేదు. కొన్నాళ్ల కింద‌ట రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు సంబంధించి ఎన్నిక జ‌రిగితే విప్ జారీ చేశారు. దీంతో అప్ప‌టికే పార్టీకి దూరంగా ఉంటున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరిలు వ‌‌చ్చి పార్టీలైన్ మేర‌కు ఓటేశారు. మ‌రి ఇంత జ‌రుగుతుంటే చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు మాత్రం విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటంటే టీడీపీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను తొల‌గించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినా.. టీడీపీ వెబ్‌సైట్‌లో చూసినా.. ఆ న‌లుగురి వివ‌రాలు.. ఫొటోలు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబు ఇలా చేయొచ్చా..?  ఏదేమైనా.. ఆయ‌నకే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


బిగ్‌బాస్‌: గీతా మాధురి, శ్రీముఖి, అరియనా ల మధ్య ఉన్న పోలిక ఏంటో తెలుసా

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>