MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/churches4bf3fde0-03be-46a5-8210-6cb75a0d9c8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/churches4bf3fde0-03be-46a5-8210-6cb75a0d9c8a-415x250-IndiaHerald.jpgక్రిస్మస్ పండుగకు వారం రోజుల గడువు మాత్రమే ఉంది. క్రిస్మస్ సందడి షూరు అయింది. కరోనా కాలంలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను నిర్వహించేందుకు అన్ని చర్చిలు ఇప్పటి నుంచే ముస్తాబు అవుతున్నాయి. డిసెంబర్ 24న అర్ధరాత్రి ఏసు క్రీస్తు జన్మించాడు. దీంతోయేటా క్రైస్తవులు డిసెంబర్ 24 రాత్రి 11గంటల నుంచి చర్చిలలో ఏసుక్రీస్తు ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు.churches;christmas;telangana;mohandas karamchand gandhi;december;khammam;medakమొదలైన క్రిస్మస్ సందడిమొదలైన క్రిస్మస్ సందడిchurches;christmas;telangana;mohandas karamchand gandhi;december;khammam;medakSun, 20 Dec 2020 09:25:49 GMTమొదలైన క్రిస్మస్ సందడి

తెలంగాణ ఫేమస్ చర్చి ఇవే

క్రిస్మస్ పండుగకు వారం రోజుల గడువు మాత్రమే ఉంది.  క్రిస్మస్ సందడి షూరు అయింది. కరోనా కాలంలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను నిర్వహించేందుకు అన్ని చర్చిలు ఇప్పటి నుంచే ముస్తాబు అవుతున్నాయి. డిసెంబర్ 24న అర్ధరాత్రి ఏసు క్రీస్తు జన్మించాడు. దీంతోయేటా  క్రైస్తవులు డిసెంబర్ 24 రాత్రి 11గంటల నుంచి చర్చిలలో ఏసుక్రీస్తు ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబర్ 25న  క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు.

ఇక తెలంగాణలోని ప్రసిద్ధమైన చర్చిలను తెలుసుకుందాం. మెదక్.. పాల్వంచ.. కొత్తగూడెం.. ఖమ్మం రూరల్.. తల్లాడ ప్రాంతాల్లోని చర్చిల్లో యేటా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతుంటాయి. ఈ చర్చిల్లో క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేస్తుంటారు.

మెదక్‌: మెదక్‌ క్యాథడ్రల్‌ చర్చికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా దీనికి పేరుంది. ఈ చర్చిలో  యేటా కుల మతాలకు అతీతంగా అందరు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఈ చర్చిలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు.

పాల్వంచ: పట్టణంలోని లివింగ్‌ గాస్పెల్‌ చర్చ్‌ ఇండిపెండెంట్‌ చర్చిల్లోనే పెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్‌ లిటిల్‌ దేవసహాయం కొందరు భక్తులతో ఈ చర్చిని బాపూజీ నగర్‌లో ప్రారంభించారు.

కొత్తగూడెం: రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా పట్టణంలోని సెయింట్‌ ఆండ్రూస్‌ సీఎస్‌ఐ చర్చి గుర్తింపు తెచ్చుకుంది. 1943లోనే 15కుటుంబాలు కలిసి పోస్టాఫీస్‌ సెంటర్‌లో దీనిని నిర్మించారు. 3వేల మంది ప్రార్థనలు ఒకేసారి చేసేలా దీనిని నిర్మించారు. ప్రతీ ఆదివారం వచ్చే క్రైస్తవులతో చర్చ కళకళలాడుతూ కన్పిస్తుంది.

ఖమ్మం రూరల్‌: కరుణగిరి చర్చి ఖమ్మంలోని నాయుడపేట నుంచి మొదలై అటు బైపాస్‌ రోడ్డు వరకూ ఆనుకొని ఉంటుంది. జిల్లాలోనే చర్చి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 21ఏళ్లుగా క్రైస్తవులు ఈ చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.

తల్లాడ: ఖమ్మం జిల్లాలోని తల్లాడలో లూర్థుమాత ఆలయంలో జిల్లాలోనే అతి పెద్దది. రోమన్‌ కేథలిక్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దీనిని 22ఏళ్ల క్రితం నిర్మించారు. చర్చిగోపురంమే 150అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట శబ్ధం చూట్టూ కిలో మీటర్ పైబడి విన్పిస్తుంది.




పోర్న్ వీడియోలు డిలీట్ చేసిన పేరెంట్స్.. కేసు వేసిన కొడుకు.. పేరెంట్స్ కి శిక్ష..?

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>