Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/helmet-manb1fe41ca-c3b3-4ebe-b970-308a73b07d94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/helmet-manb1fe41ca-c3b3-4ebe-b970-308a73b07d94-415x250-IndiaHerald.jpg‘సూపర్ మ్యాన్’, ‘ఐరన్ మ్యాన్’, ‘స్పైడర్ మ్యాన్’.. ఇలాంటి ఎందరో యాక్షన్ సూపర్ హీరోలు మనకు సినిమాల్లో కనిపిస్తుంటారు. అయితే ఎప్పుడైనా ఇలాంటి ఓ ‘మ్యాన్’ను లైవ్‌లో చూశారా..? లేకపోతే వెంటనే బీహార్ బయలుదేరండి. అక్కడ మీకు ఓ హెల్మెట్ మ్యాన్..helmet man;kumaar;krishna;naga chaitanya;varanasi;bari;district;bihar;village;iron;wife;spyder;father;chaitanya 1;noida;raghavendraబీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘helmet man;kumaar;krishna;naga chaitanya;varanasi;bari;district;bihar;village;iron;wife;spyder;father;chaitanya 1;noida;raghavendraSun, 20 Dec 2020 10:04:37 GMTబీహార్ బయలుదేరండి. అక్కడ మీకు ఓ హెల్మెట్ మ్యాన్ కనపడతాడు. ప్రజలకు ఉచితంగా హెల్మెట్‌లు పంచుతూ కనపడతాడు. తన సొంత డబ్బుతో హెల్మెట్‌లు కొని వాహనదారులకు పంచుతూ ఉంటాడు. ఇప్పటి వరకు దాదాపు 50 వేలకు పైగా హెల్మెట్‌లను ఇలా పంచేశాడు. అంతేకాదు.. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రమాదాలను వాహనదారులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు.

బీహార్‌లోని కైమూర్ జిల్లా, బాగడీ గ్రామంలో రాఘవేంద్ర కుమార్ నివశిస్తున్నారు. 2014లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో రాఘవేంద్ర తన ప్రాణస్నేహితుణ్ణి కోల్పోయాడు. ఆ దుర్ఘటన ఆయన మనసుకు తీరని గాయం చేసింది. తన స్నేహితుడిలా రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారెవరూ చనిపోకుండా చైతన్యం తీసుకురావాలనుకున్నాడు. అంతే.. అతడిలో ఓ గొప్ప ఆలోచనకు బీజం పడింది. అప్పటి నుంచి రాఘవేంద్ర ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం ప్రారంభించాడు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 48 వేల హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందరూ నిబంధనలు పాటించాలని, అదొక్కటే వారిని ప్రమాదాల బారి నుంచి కాపాడుతుందని రాఘవేంద్ర చెబుతున్నాడు.

తన అనుభవాలను వాహనదారులకు వివరిస్తూ రాఘవేంద్ర. ‘ మా నలుగురి సోదరులలో నేను చిన్నవాడిని. నాన్న చేసే వ్యవసాయంతో ఇల్లు నడిచేది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా నాన్న మమ్మల్ని స్కూలుకు పంపించారు. 12వ తరగతి పూర్తి చేశాను. తరువాత వారణాసి చేరాను. 5ఏళ్ల పాటు చిన్ని చిన్న పనులతో కాలం గడిపాను. 2009లో లా కోర్సు చదవాలని ఢిల్లీకి వెళ్లాను. అక్కడ నాకు కృష్ణకుమార్‌తో మంచి స్నేహితుడయ్యాడు.

ఇద్దరం ఒకే హాస్టల్‌లో ఉండేవాళ్లం. 2014లో కృష్ణకుమార్ హెల్మెట్ ధరించకుండా, గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ హైవేపై బండి నడుపుతున్నాడు. ఇంతలో ఉన్నట్లుండి పక్కనే వస్తున్న మరో వాహనం అతడిని గుద్దేసింది. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు దెబ్బతగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవికాదని ఆసుపత్రి వైద్యులు అన్నారు. ఈ మాటతో నాలో ఆలోచన మొదలైంది. అంతే.. రోడ్డు భద్రత గురించి ప్రచారం ప్రారంభించాను. ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తూ వస్తున్నాను. దానికోసం ఉద్యోగం మానేశాను.

హెల్మెట్లను పంపిణీ చేసేందుకు డబ్బులు సరిపోకపోవడంతో నా భార్య నగలను అమ్మేశాను. చివరికి ఇంటిని కూడా విక్రయించి, ఇప్పటివరకూ 48 వేల హెల్మెట్ల వరకు ఉచితంగా వాహనదారులకు అందజేశాను. వాహనం నడిపేటప్పుడు అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి. అదొక్కటే మీ ప్రాణాలను కాపాడగలదు’ అంటూ రాఘవేంద్ర కోరారు.

ఏది ఏమైనా స్నేహితుడి మరణం రాఘవేంద్రలో తెచ్చిన మార్పు అసామాన్యం. ఇప్పటికైనా వాహనదారులు నిబంధనలు పాటించండి. హెల్మెట్ ధరించందే ద్విచక్ర వాహనదారులు బైక్‌లపై తిరగకండి. ఇది మీ కోసం మాత్రమే కాదు.. మీ కుటుంబం కోసం కూడా.


చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>