TVSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss-44b321e89-f321-4e0f-a94f-3c297e47589d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss-44b321e89-f321-4e0f-a94f-3c297e47589d-415x250-IndiaHerald.jpgషోలో పాల్గొనడం వల్ల తమ ఇమేజ్ మరింత పెరిగిందని కొందరు, తమను గుర్తుపడుతున్నారు మరికొందరు చెప్పారు. గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని.. వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని, గొంతు నెప్పి పుడుతోందని నాగార్జునతో చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండిపోయినా బాగుండేదని అనిపిస్తోందని వెల్లడించారు. రోజుకి 500 మంది తనను కలవడానికి వస్తున్నారన్నారు. ఇల్లు కట్టిస్తున్నారు.. చాలా సంతోషం అంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు.bigg boss 4;nagarjuna akkineni;nageshwara rao akkineni;soori;bigboss;televisionరోజుకి 500 మంది కలవాలని వస్తున్నారురోజుకి 500 మంది కలవాలని వస్తున్నారుbigg boss 4;nagarjuna akkineni;nageshwara rao akkineni;soori;bigboss;televisionSun, 20 Dec 2020 20:45:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ప్రారంభమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ‘డాన్’ సినిమాలోని ‘సూరి అన్న’ పాటతో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్ములేపారు. పువ్వుల షేర్వానీలో నాగ్ లుక్ అదిరిపోయింది. నాగార్జున ఎంట్రీ తరవాత బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్‌ల తరవాత నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 3కు సంబంధించి ప్రేక్షకులు 8 కోట్ల ఓట్లు వేయగా, సీజన్ 4కు 15 కోట్ల 65 లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు. స్టేజ్‌పై పెర్ఫార్మెన్స్ చేసిన 14 మంది మాజీ కంటెస్టెంట్లను ఒకేసారి ఆహ్వానించిన నాగార్జున.. వాళ్లను గోల్డెన్ కలర్ సోఫాల్లో కూర్చోవాలని సూచించారు. ఆ తరవాత ఒక్కొక్కరి బిగ్ బాస్ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.


అందరూ బిగ్ బాస్ షోను ఆకాశానికి ఎత్తేశారు. ఈ షోలో పాల్గొనడం వల్ల తమ ఇమేజ్ మరింత పెరిగిందని కొందరు, తమను గుర్తుపడుతున్నారు మరికొందరు చెప్పారు. గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని.. వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని, గొంతు నెప్పి పుడుతోందని నాగార్జునతో చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండిపోయినా బాగుండేదని అనిపిస్తోందని వెల్లడించారు. రోజుకి 500 మంది తనను కలవడానికి వస్తున్నారన్నారు. ఇల్లు కట్టిస్తున్నారు.. చాలా సంతోషం అంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ కంటెస్టెంట్లతో ముచ్చట్లు అయిపోయిన తరవాత హౌస్‌లో ఉన్న ఐదుగురు ఫైనలిస్టులు సోలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. ఐదుగురు పెర్ఫార్మెన్స్‌లు అయిపోయిన తరవాత అందరూ కలిసి మళ్లీ పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ తరవాత వాళ్లందరినీ కూర్చోబెట్టి వాళ్ల కుటుంబ సభ్యులను మన టీవీ ద్వారా చూపించారు నాగార్జున. ఒక్కొక్కరితో మాట్లాడారు. ఒక్కొక్కరికీ హౌస్‌లో ఇష్టమైన ప్లేస్‌ను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.


అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>