PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ananthapuram-jillalo-mantalu-arpendhuku-velli-fire-officer226d852f-b654-455b-aef6-eef8e1778e3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ananthapuram-jillalo-mantalu-arpendhuku-velli-fire-officer226d852f-b654-455b-aef6-eef8e1778e3c-415x250-IndiaHerald.jpgరోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోడ్డు ప్రమదాలకి సంబంధించి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటోంది. మనం కరెక్ట్ గా వెళుతున్నా సరే ఎదురు వచ్చే వాళ్ళు సరిగ్గా వస్తారన్న నమ్మకం లేదు. సో రోడ్డు ఎక్కితే ఇంటికి రావడం అనేది దేవుడి మీదనే ఆధార పడి ఉంటుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లోని ఆలూరు స్టేజి సమీపంలో కారు బైక్ ఢీ కొంది. ఈ క్రమంలో బైక్ లో చెలరేగిన మంటల కారణంగా బైక్ పూర్తిగా దగ్ధం అయింది. బైక్ మీద ఉన్నవ్యక్తి మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాtollywood;deva;hyderabad;district;smart phone;police;bike;minister;ranga reddyదారుణం : కారు - బైక్ ఢీ, మంటలు చెలరేగి బైక్ మీదున్న మనిషి సజీవ దహనం !దారుణం : కారు - బైక్ ఢీ, మంటలు చెలరేగి బైక్ మీదున్న మనిషి సజీవ దహనం !tollywood;deva;hyderabad;district;smart phone;police;bike;minister;ranga reddySun, 20 Dec 2020 16:00:00 GMTరోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోడ్డు ప్రమదాలకి సంబంధించి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటోంది. మనం కరెక్ట్ గా వెళుతున్నా సరే ఎదురు వచ్చే వాళ్ళు సరిగ్గా వస్తారన్న నమ్మకం లేదు. సో రోడ్డు ఎక్కితే ఇంటికి రావడం అనేది దేవుడి మీదనే ఆధార పడి ఉంటుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లోని ఆలూరు స్టేజి సమీపంలో కారు బైక్ ఢీ కొంది. ఈ క్రమంలో బైక్ లో చెలరేగిన మంటల కారణంగా బైక్ పూర్తిగా దగ్ధం అయింది. బైక్ మీద ఉన్నవ్యక్తి మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

మృతి చెందిన వ్యక్తి చిలకమర్రి గ్రామానికి చెందిన అనంతయ్యగా గుర్తించారు.  చేవెళ్ళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు బైక్ నుండి మంటలు ఎందుకు వెలువడ్డాయి అనేది ఇప్పటికీ అర్ధం కావడం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 ఇక ఈ ఘటన జరిగిన కొద్దీ సేపటికి తన స్వగ్రామమైన కౌకుంట్ల నుండి హైదరాబాద్ కి వెళుతున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాదాన్ని చూసి ఘటన స్థలం దగ్గర ఆగి ఈ రోడ్డు ప్రమాదం వివరాలు తెలుసుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం చేవెళ్ళ ఏసీపీ కి ఫోన్ చేశారు. మృతుడిని ఆటోలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మంత్రి హైదరాబాదు నగరానికి  బయలుదేరి వెళ్లారు. రోడ్డు ప్రమాద సంఘటన పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు.  


కొంపముంచిన కొత్త వైరస్ ? మళ్ళీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నా బ్రిటన్

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>