Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pawan-kalyan9a489a83-f472-4d4a-b8c6-23903fc67fde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pawan-kalyan9a489a83-f472-4d4a-b8c6-23903fc67fde-415x250-IndiaHerald.jpgహీరోలకోసం ఫ్యాన్స్ ఎగబడడం ఎప్పుడూ చూస్తుంటాం. తమ అభిమాన హీరో కనపడితో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. అతడికి ఊపిరి కూడా ఆడనివ్వరు. దీంతో ఆ హీరోలు తమ ఫ్యాన్స్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే టాలీవుడ్‌‌లో ఎంతమంది హీరోలున్నా..pawan kalyan;pawan;pawan kalyan;sriram;korcha;cinema;hindi;remake;hero;pink;paritala sriram;mass;chitramమోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!pawan kalyan;pawan;pawan kalyan;sriram;korcha;cinema;hindi;remake;hero;pink;paritala sriram;mass;chitramSun, 20 Dec 2020 11:04:00 GMTహీరో కనపడితో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. ఊపిరి కూడా ఆడనివ్వరు. దీంతో ఆ హీరోలు తమ ఫ్యాన్స్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే టాలీవుడ్‌‌లో ఎంతమంది హీరోలున్నా.. వారందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఆయన కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తారు. మరి అలాంటి ఫ్యాన్స్ కోసం పవన్ ఏం చేస్తారు..? అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో స్పష్టమైన సమాధానం చెబుతోంది.

పవర్ స్టార్ ఇమేజ్.. మిగతా హీరోలతో పోల్చితే టాప్ రేంజ్ ఫ్యాన్స్... హిట్, ప్లాప్‌తో సంబంధం లేని క్రేజ్.. ఇది పవన్‌ ట్రాక్ రికార్డ్. అయినప్పటికీ ఆయనలో ఏ మాత్రం అహంకారం ఉండదు అనడానికి ఈ ఫోటో పెద్ద ఉదారహణగా నిలుస్తోంది. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్న స్పాట్‌లో తీసిన ఈ ఫోటోలో ఫ్యాన్స్‌తో ఫోటో దిగేందుకు పవన్ ఏకంగా మోకాళ్లపై కూర్చున్నారు. పవన్ లాంటి స్టార్ హీరో సాధారణ వ్యక్తిలా ఇలా ఫ్యాన్స్‌తో ఫోటో దిగడం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్న పవన్ అభిమానులు.. ‘అభిమానుల కోసం ఏదైనా చేసే మనస్తత్వం.. అహంకారం అంటే తెలియని తత్వం.. ఇవే మా హీరో గుణాలు.. ఇలాంటి వ్యక్తిత్వం మరెవ్వరికీ సాధ్యం కాదు.. అందుకే మీరు మా హీరో పవన్ సార్!’ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రస్తుతం హిందీ పింక్ చిత్ర రీమేక్ ‘వకీల్‌సాబ్‌’‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత పవన్ మరికొన్ని ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపనట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు రాజకీయాల కోసం గడ్డం, లాల్చీ పైజమాతో మాస్ లుక్‌లో కనిపించిన పవన్ ఇప్పుడు సినిమా కోసం పూర్తి స్టైలిష్ లుక్‌లోకి మారిపోయారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాట సేద్యం!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>