PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-leading-in-krishna-politics4bf41a9c-6ab4-4a10-8774-4ecf0368cc43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-leading-in-krishna-politics4bf41a9c-6ab4-4a10-8774-4ecf0368cc43-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా ఎక్కువగా టీడీపీకి అనుకూలమైన జిల్లా. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఫలితాలు టీడీపీకే కాస్త అనుకూలంగా వచ్చేవి. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. జిల్లాలో 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకోగా, టీడీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఇందులో వల్లభనేని వంశీ సైతం వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వైసీపీ బలం మరింత పెరిగింది. టీడీపీ బలం తగ్గుతూ వస్తుంది. kodali nani;nani;srinivas;udaya bhanu;vamsi;krishna river;jagan;gadde rama mohan;devineni avinash;2019;district;kesineni nani;vallabhaneni vamsi;minister;konakalla narayana rao;krishna district;tdp;ycp;devineni uma maheswara rao;bonda umamaheswara raoఅక్కడ కొడాలిదే లీడింగ్...ఆ ఎమ్మెల్యేలు తేలిపోతున్నారా?అక్కడ కొడాలిదే లీడింగ్...ఆ ఎమ్మెల్యేలు తేలిపోతున్నారా?kodali nani;nani;srinivas;udaya bhanu;vamsi;krishna river;jagan;gadde rama mohan;devineni avinash;2019;district;kesineni nani;vallabhaneni vamsi;minister;konakalla narayana rao;krishna district;tdp;ycp;devineni uma maheswara rao;bonda umamaheswara raoSun, 20 Dec 2020 04:00:00 GMTకృష్ణా జిల్లా ఎక్కువగా టీడీపీకి అనుకూలమైన జిల్లా. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఫలితాలు టీడీపీకే కాస్త అనుకూలంగా వచ్చేవి. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. జిల్లాలో 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకోగా, టీడీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఇందులో వల్లభనేని వంశీ సైతం వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వైసీపీ బలం మరింత పెరిగింది. టీడీపీ బలం తగ్గుతూ వస్తుంది.

అయితే 2019 ఎన్నికల నుంచి కృష్ణా కాస్త వైసీపీకి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పైగా జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరింత అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇక రాజకీయంగా ఇక్కడ వైసీపీలో బాగా బలమైన నేతలు కూడా తయారవుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ డామినేషన్ ఉండేది కాబట్టి, ఆ పార్టీలో దేవినేని ఉమా, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బొండా ఉమా, కొనకళ్ళ నారాయణ, ఇంకా పలువురు బలమైన నేతల హవా ఉండేది.

కానీ ఇప్పుడు వైసీపీ డామినేషన్ ఉంది. అయితే ఆ పార్టీలో బాగా బలమైన నాయకుడు అంటే కొడాలి నానినే అని చెప్పొచ్చు. కృష్ణా జిల్లా వైసీపీ పేరు చెప్పగానే మొదట కొడాలి పేరునే గుర్తొస్తుంది. టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీలో సైతం రెండుసార్లు గెలిచి, జగన్ కేబినెట్‌లో మంత్రిగా కీలకంగా పనిచేస్తున్న కొడాలికి జిల్లా వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. జిల్లాలో బాగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కూడా కొడాలినే.

ఇక కొడాలి తర్వాత మరో మంత్రి పేర్ని నానికి సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకంటూ సెపరేట్ క్రేజ్ ఉంది. ఇక జిల్లాలో గుర్తింపు ఉన్న నాయకుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పార్థసారథి, సామినేని ఉదయభానులు ఉన్నారు. అయితే జిల్లాలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు లేవు. ఏదేమైనా కృష్ణాలో కొడాలి నానిదే లీడింగ్.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీని వీడటమే ఆ వైసీపీ ఎమ్మెల్యే లక్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>