EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/lic-scholarship827161f5-1ff1-491e-8f68-6d52e23970b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/lic-scholarship827161f5-1ff1-491e-8f68-6d52e23970b4-415x250-IndiaHerald.jpgవిద్యార్థుల్లో ఉన్న ప్రతిభను నిరూపించుకునే సమయం వచ్చింది.. ప్రతిభ గల విద్యార్థులకు ఎల్ఐసీ అదిరిపోయే అవకాశాన్ని అందిస్తుంది. ఎల్ఐసీ భీమా సంస్థ స్కాలర్ షిప్ ను అందిస్తుంది.. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 కి దరఖాస్తు చేయొచ్చు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసీ స్కాలర్‌షిప్ లక్ష్యం..lic scholarship;bank;december;2020;diplomaవిద్యార్థులకు శుభవార్త చెప్పిన ఎల్ఐసీ..!!విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఎల్ఐసీ..!!lic scholarship;bank;december;2020;diplomaSun, 20 Dec 2020 18:00:00 GMT2020 కి దరఖాస్తు చేయొచ్చు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసీ స్కాలర్‌షిప్ లక్ష్యం..



అయితే, భారత దేశం లో ఏ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల అయినా కూడా ఈ స్కాలర్ షిప్ కు అర్హులు అని భీమా సంస్థ వెల్లడించింది. ఐటీఐలో టెక్నికల్, వొకేషనల్ కోర్సులు చదివేవారు అయిన ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది. ఈ విధానం ద్వారా విద్యార్థులకు మంచి చేకూరుతుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. 



12వ తరగతి లేదా ఇంటర్, 10వతరగతి పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,00,000 దాటకూడదు. మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేవారు ఎల్ఐసీ స్కాలర్‌ షిప్‌కు అప్లై చేయొచ్చు. ఎల్ఐసీ ఇచ్చే స్కాలర్‌షిప్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం మాత్రమే. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు ఈ స్కాలర్ ‌షిప్ వర్తించదు. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే దీనికీ అప్లై చేసుకోవాలి.50 శాతం మార్కులతో కోర్సు పూర్తి చేయాలి. కోర్సులో ఫెయిల్ అయితే స్కాలర్‌షిప్ నిలిపివేస్తారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే వారి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటి వివరాలను తీసుకుంటుంది.. దాని ద్వారా డబ్బులను నేరుగా వారి ఆకౌంటులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది..




బిగ్‌బాస్‌: గీతా మాధురి, శ్రీముఖి, అరియనా ల మధ్య ఉన్న పోలిక ఏంటో తెలుసా

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>