PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1cbf7cb3-15c9-4091-9077-1f5beabf0214-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1cbf7cb3-15c9-4091-9077-1f5beabf0214-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని బాగా నమ్ముకున్నారు. గట్టిగానే ఆయన ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు తన రాజకీయ అనుభవం పదే పదే గొప్పగా చెప్పుకుని కేంద్రంలోని మోడీకి మంటెక్కించారు. దాంతో వారి బంధం చెడిపోయింది. జగన్ మాత్రం తాను అలా కాదు కేంద్ర పెద్దలను గౌరవించి కావాల్సినవి చేయించుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ఏడాదిన్నర పాలన పూర్తి అయ్యాక జగన్ కి అర్ధమవుతున్నది ఏంటి అంటే మోడీ షాలకు జగన్ అయినా బాబు అయినా ఒక్కటేనని. jagan;modi;jagan;capital;chief minister;polavaram project;central government;ycpవరమివ్వని మోడీ...జగన్ ఏం చేస్తారు...?వరమివ్వని మోడీ...జగన్ ఏం చేస్తారు...?jagan;modi;jagan;capital;chief minister;polavaram project;central government;ycpSun, 20 Dec 2020 10:00:00 GMTముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని బాగా నమ్ముకున్నారు. గట్టిగానే ఆయన ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు తన రాజకీయ అనుభవం పదే పదే గొప్పగా చెప్పుకుని కేంద్రంలోని మోడీకి మంటెక్కించారు. దాంతో వారి బంధం చెడిపోయింది. జగన్ మాత్రం తాను అలా కాదు కేంద్ర పెద్దలను గౌరవించి కావాల్సినవి చేయించుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ఏడాదిన్నర పాలన పూర్తి అయ్యాక జగన్ కి అర్ధమవుతున్నది ఏంటి అంటే మోడీ షాలకు జగన్ అయినా బాబు అయినా ఒక్కటేనని.

అందుకే కేంద్రం వద్ద ఎన్ని అర్జీలు పెట్టినా వర్కౌట్ కావడంలేదు. ఎన్ని రకాలైన విన్నపాలు చేసుకున్నా కూడా అంగుళం కదలడంలేదు. జగన్ ఇపుడు అతి పెద్ద చిక్కుల్లో పడిపోయారు. అదే పోలవరం సమస్య. అందరూ రాజధాని గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ ఇపుడు అందరికీ అతి ముఖ్యం.

పోలవరం పూర్తి అయితే వ్యవసాయాధారిత రాష్ట్రం అయిన ఏపీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. పారిశ్రామిక అవసరాలకు తగిన నీరు లభిస్తుంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఏపీలో అద్భుతాలే జరుగుతాయి. రాజధానుల నిర్మాణాలు వాటి వల్ల వచ్చే పెట్టుబడులు లాభాలకు ఏళ్ళూ ఊళ్ళూ పడుతుంది కానీ పోలవరం మాత్రం వెంటనే గరిష్ట లాభాలు ఇస్తుంది. పైగా ఇది కనుక పూర్తి చేసి జగన్ ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా మరోమారు విజయం సాధించడం ఖాయం. అందుకే జగన్ కేంద్రాన్ని ఈ వరం అడుగుతున్నారు.

కేవలం 20 వేల కోట్ల వరకే సాయం చేస్తామన్న కేంద్రాన్ని సవరించిన అంచనాలకు తగినట్లుగా నిధులు మంజూరు చేయమని జగన్ కోరుతున్నారు. కానీ కేంద్రం మాత్రం అసలు ఒప్పుకోవడంలేదుట. ఆ ఒక్కటీ అడగవద్దు అని కేంద్ర పెద్దలు చెప్పకనే చెప్పేయడంతో పోలవరం టెన్షన్ ఇపుడు వైసీపీ సర్కార్ కి పట్టుకుంది అంటున్నారు. మరి జగన్ ఈ గండం ఎలా గట్టెక్కుతారో చూడాల్సిందే.






బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>