Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/anand-mahindra-shares-a-video-of-an-elephant-and-tiger-behind-it-is-going-viralfa68c13b-35b6-4404-8cf3-14ff0e953126-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/anand-mahindra-shares-a-video-of-an-elephant-and-tiger-behind-it-is-going-viralfa68c13b-35b6-4404-8cf3-14ff0e953126-415x250-IndiaHerald.jpgఓ ఏనుగు హాయిగా ఏదో తింటూ ప్రశాంతంగా నెమరు వేస్తోంది. ఇంతలో వెనకాల ఏదో అలికిడి. తిండి తింటున్న ఆనందంలో ఉన్న ఏనుగుకు ఆ అలికిడి వినపడలేదు. అయితే ఆ అలికిడి అల్లాటప్పాగా వచ్చింది కాదు. ఏనుగు వెనక ఉన్న పులి వల్ల కలిగిన అలికిడది. ఏనుగు వెనక ఉన్న దట్టమైన పొదల్లో దాగి ఉన్న పులి చేసిన చప్పుడది. అయితే ఆ పులి ఏనుగుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోందా..?..anand mahindra;anand malayalam actor;twitter;tiger;mahindra;anand deverakonda;tiger 1;anandamఓ ఏనుగు.. పులి... వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్!ఓ ఏనుగు.. పులి... వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్!anand mahindra;anand malayalam actor;twitter;tiger;mahindra;anand deverakonda;tiger 1;anandamSun, 20 Dec 2020 13:42:00 GMTపులి వల్ల కలిగిన అలికిడది. ఏనుగు వెనక ఉన్న దట్టమైన పొదల్లో దాగి ఉన్న పులి చేసిన చప్పుడది. అయితే ఆ పులి ఏనుగుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోందా..? లేక ఏనుగు కంట పడకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవాలనుకుంటుందా..? అనేదే ఇక్కడ ట్విస్ట్.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లకు సోషల్‌మీడియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన చేసే ప్రతి ట్వీట్‌లో ఓ ప్రత్యేకత ఉంటుంది. జోక్స్ ట్వీట్ చేసినా.. సమాజంలో మన బాధ్యతను గుర్తు చేస్తూ హెచ్చరించినా.. మనలోని ఆలోచనాశక్తిని తట్టి లేపినా.. ఆ ట్వీట్లలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి ట్వీట్ ఒకటి చేశారు ఆనంద్ మహీంద్రా. తాజాగా ప్రకృతికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. నాగర్‌హోల్ అభయారణ్యంలో ఓ ఏనుగు, దాని వెనక గడ్డి పొదల్లో నక్కి ఉన్న పులికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తెగ థ్రిల్ అవుతున్నారు. ప్రకృతిలోని రమణీయతను, బీభత్సాన్ని ఓకేసారి కళ్లకు కట్టినట్లు చూపించే ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా ఓ పద్యాన్ని కూడా జోడించారు. విలియమ్ బ్లేక్ అనే పాశ్చాత్య కవి రచించిన ‘టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్..’ అంటూ సాగే ఓ పద్యాన్ని కూడా షేర్ చేశారు. పచ్చని చెట్ల మధ్య కళ్లలో ఓ గొప్ప జ్వాలతో రగిలిపోతున్న పులి గురించి రాసిన పద్యం అది.

ఇదిలా ఉంటే ఇంతటి గొప్ప వీడియోను షేర్ చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు నెటిజన్లు కృతజ్ఞతలు చెబుతున్నారు. అంతేకాదు అంత అద్భుతమైన పద్యాన్ని మళ్లీ గుర్తు చేసినందుకూ థాంక్స్ చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం.. నెక్స్ట్ ఏమౌతుంది.. అసలు పులి ఏనుగుపై దాడి చేయాలనే అనుకుంటోందా..? లేక పారిపోతోందా..? ఈ విషయానికి ఆన్సర్ ఎలా తెలుసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు. ఇంకొందరైతే ఈ వీడియోపై జోకులు కూడా పేల్చుతున్నారు. ఏనుగు తోక చూసి పులి షాకైందంటూ కామెంట్లు పెడుతున్నారు.! ఇప్పటివరకూ ఈ వీడియోను 36 వేల మంది చూడగా.. వెయ్యికి పైగా లైకులు వచ్చాయి.
">
" style="height: 370px;">




స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే ?

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>