PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-vs-ktr-election-promises8b5f297d-60ac-4f1b-bb5c-5004d178fa9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-vs-ktr-election-promises8b5f297d-60ac-4f1b-bb5c-5004d178fa9f-415x250-IndiaHerald.jpgహామీల అమలులో కేసీఆర్ కూడా సగటు రాజకీయ నాయకుడిలాగే ఆలోచిస్తారనే అపవాదు ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల ప్రస్తావన చేసిన కేసీఆర్ ఆ తర్వతా అసెంబ్లీలో.. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలంటే సాధ్యమేనా అని ప్రశ్నించారు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇప్పించినట్టేనా అని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు గతంలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇటీవల హైదరాబాద్ లో వరద నష్టం పరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలపాలైంది. సరిగ్గా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు పరిహారం ప్రకటించి, ఆ తర్ktr;kcr;ktr;amala akkineni;suma;suma kanakala;hyderabad;telangana;january;cheque;aquaకేసీఆర్ ని నమ్ముకుంటే లాభం లేదు.. రంగంలోకి దిగిన కేటీఆర్..కేసీఆర్ ని నమ్ముకుంటే లాభం లేదు.. రంగంలోకి దిగిన కేటీఆర్..ktr;kcr;ktr;amala akkineni;suma;suma kanakala;hyderabad;telangana;january;cheque;aquaSun, 20 Dec 2020 11:00:00 GMTకేసీఆర్ కూడా సగటు రాజకీయ నాయకుడిలాగే ఆలోచిస్తారనే అపవాదు ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల ప్రస్తావన చేసిన కేసీఆర్ ఆ తర్వతా అసెంబ్లీలో.. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలంటే సాధ్యమేనా అని ప్రశ్నించారు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇప్పించినట్టేనా అని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు గతంలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇటీవల హైదరాబాద్ లో వరద నష్టం పరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విమర్శలపాలైంది. సరిగ్గా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు పరిహారం ప్రకటించి, ఆ తర్వాత కోడ్ వల్ల అడ్డంకి ఎదురవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. ఆ నెపం ప్రతిపక్షాలపైకి నెట్టేయాలని చూసినా కుదరలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

కట్ చేస్తే.. ఇలాంటి వ్యవహారాలన్నిటికీ చెక్ పెట్టాలనుకుంటున్నారు కేటీఆర్. హామీల అమలుపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ఇటీవల కేసీఆర్ మరో దఫా తెలంగాణ యువతకు ఉద్యోగాల హామీ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్ ఫాలోఅప్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వంటివి వచ్చినా కూడా కోడ్ అడ్డంకి లేకుండా ఉద్యోగ నియామక ప్రక్రియ సజావుగా సాగేలా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వాసులకు ఉచిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని కూడా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 2021 జనవరి నుంచి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకు రాబోతున్నట్టు ప్రకటించారు.

కొత్త ఏడాదికి ముందే హైదరాబాద్‌ నగర వాసులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జనవరి తొలి వారం నుంచే ఉచిత నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయబోతున్నట్టు తెలిపారు కేటీఆర్. రెండు రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డిసెంబరు నెల నుంచే 20 వేల లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోబోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబరు బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఉచిత తాగునీటి హామీతోపాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. 


ఫ్యాన్స్ తో పవన్.. ఇది కదా పవర్ స్టార్ అంటే..!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>