PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/president4a8ef645-e14e-4ce7-b27c-4c3c5a510c65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/president4a8ef645-e14e-4ce7-b27c-4c3c5a510c65-415x250-IndiaHerald.jpgప్రతి ఏటా వింటర్ లో ఉండే భారత రాష్ట్రపతి బొల్లారం విడిది ఈ సంవత్సరం రద్దైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ కు రావడం లేదని అంటున్నారు.ఈ నెల 16వ తేదీనే రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం వస్తున్నారన్న అంచనాతో నిలయాన్ని ముస్తాబు చేశారు. అయితే ఆయన పర్యటన వాయిదా పడినట్లు అధికారికంగా ఇంకా సమాచారం రాలేదు. president;soundarya;ram pothineni;delhi;hyderabad;mini;december;central government;vరాష్ట్రపతి బొల్లారం శీతాకాల విడిది రద్దు?రాష్ట్రపతి బొల్లారం శీతాకాల విడిది రద్దు?president;soundarya;ram pothineni;delhi;hyderabad;mini;december;central government;vSun, 20 Dec 2020 10:49:13 GMTహైదరాబాద్ కు రావడం లేదని అంటున్నారు.ఈ నెల 16వ తేదీనే రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం వస్తున్నారన్న అంచనాతో నిలయాన్ని ముస్తాబు చేశారు. అయితే  ఆయన పర్యటన వాయిదా పడినట్లు అధికారికంగా ఇంకా సమాచారం రాలేదు. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పర్యటనను వాయిదా వేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ, బొల్లారం అధికార వర్గాల సమాచారం.

దేశ ప్రథమ పౌరుడి హోదాలో రాష్ట్రపతి ప్రతీ ఏడాది శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రావడం అనాదిగా వస్తోంది.డిసెంబర్ 16వ తేదీ నుంచి 15 రోజుల పాటు రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది చేయనున్నట్లు షెడ్యూలు మొదట ఖరారైంది.అయితే  కరోనా కారణంగా తన పర్యటనను రాష్ట్రపతి విరమించుకున్నట్లు సమాచారం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు సందర్శకులను నిలిపివేసినప్పుడే కొందరు భవన్ సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ పర్యటన  ఉంటే అధికార, రాజకీయ ప్రతినిధులతో భేటీలు, తేనీటి విందు, సందర్శకులతో సమావేశాలు ఉంటాయి కాబట్టి.. రిస్కు తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది వాయిదా పడినట్లు సమాచారం.

ఇప్పటికే  బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని కోవింద్ కోసం ముస్తాబు చేశారు.  అవసరమైన మరమ్మతు పనులు కూడా పూర్తయ్యాయి. నిలయంలో ఏ లోటూ లేకుండా పారిశుధ్యం, భవనాల మరమ్మతు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ప్లంబర్, ఫర్నిచర్, తాగునీరు, రన్నింగ్ వాటర్, పెయింటింగ్‌తో పాటు దట్టంగా ఉండే చెట్ల నరికివేత, పాములు లేకుండా చేయడం వంటి ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పది కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తిచేసింది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో మినీ అటవీ ప్రాంతాన్ని తలపించే రాష్ట్రపతి నిలయంలో ప్రకృతిని ప్రతిబింబించే దట్టమైన చెట్లు, మనసుకు ఉల్లాసం కలిగించే పూల మొక్కలు, సౌందర్యం కోసం గార్డెన్లు ఉన్నాయి. సుమారు ఇరవైకి పైగా గదులున్నాయి. వాటిలో కొన్ని అతిథుల వసతి కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల ఏర్పాటుకు ఉపయోగపడుతున్నాయి.


ఫ్యాన్స్ తో పవన్.. ఇది కదా పవర్ స్టార్ అంటే..!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>