PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bef0fd2-36c6-419a-8de5-7bddb593b347-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4bef0fd2-36c6-419a-8de5-7bddb593b347-415x250-IndiaHerald.jpgనారాయణ పేట జిల్లా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వవ్యవసాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో చావు దెబ్బతిని.. రైతుల పక్షాన బంద్ చేసిండు.. ఆ బందులో రైతులు ఎవ్వరూలేరు.. రైతుల మీద ప్రేమ ఉన్నోడు.. ఢిల్లీలో రైతుల ధర్నాకు ఎందుకు పోలేదు... అక్కడికి పోయి మన నాయకులకు వంగి వంగి దండాలు పెట్టి వచ్చిండు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రైతులు తాము పండించిన పంటలు ఎక్కడన్నా అమ్ముకోవచ్చని చెప్పkcr;kcr;prema;hyderabad;bharatiya janata party;telangana;district;love;central government;house;hindus;petta;partyబిడ్డా కేసీఆర్ ఇంకా రెచ్చగొట్టలేదు... చూస్తూ ఉండూ హైదరాబాద్ లో కాదు తెలంగాణాలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాబిడ్డా కేసీఆర్ ఇంకా రెచ్చగొట్టలేదు... చూస్తూ ఉండూ హైదరాబాద్ లో కాదు తెలంగాణాలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాkcr;kcr;prema;hyderabad;bharatiya janata party;telangana;district;love;central government;house;hindus;petta;partySun, 20 Dec 2020 19:31:02 GMTపేట జిల్లా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వవ్యవసాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో చావు దెబ్బతిని.. రైతుల పక్షాన బంద్ చేసిండు.. ఆ బందులో రైతులు ఎవ్వరూలేరు.. రైతుల మీద ప్రేమ ఉన్నోడు.. ఢిల్లీలో రైతుల ధర్నాకు ఎందుకు పోలేదు... అక్కడికి పోయి మన నాయకులకు వంగి వంగి దండాలు పెట్టి వచ్చిండు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రైతులు తాము పండించిన పంటలు ఎక్కడన్నా అమ్ముకోవచ్చని చెప్పడం తప్పా అని నిలదీశారు.

మన పంట దిగుబడికి.. కార్పొరేటు కంపెనీలతో ఒప్పందం కుదుర్చు కోవడం తప్పా అని ప్రశ్నించారు. పంట చేతికి వచ్చిన మూడు రోజుల్లో డబ్బు చెల్లించాలి.. లేకుంటే అగ్రిమెంట్ క్యాన్సల్ ఐతది అన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం 120  కోట్లు ఇస్తే.. తన ఫామ్ హౌస్ లో దొడ్డు వడ్లు పండించి లాభం పొందాడు.. సామాన్యులకు సన్న బియ్యం పండించమని చెప్పాడు అని విమర్శలు చేసారు. బండి సంజయ్ రెచ్చ గొడుతున్నాడు అన్నాడు అని... బిడ్డా ఇంకా రెచ్చగొట్టలేదు.. కచ్చితంగా రెచ్చ గొడతా... నిన్ను రెచ్చి పోయేలా చేస్తా అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.

బీజేపీ మతతత్వ పార్టీ అంటున్నారు.. యెస్... ఎనబై శాతం ఉన్న హిందువులకోసం పని చేస్తాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో సర్గికల్ స్ట్రైక్ చేస్తానన్నా... అవకాశం రాలేదు.. కానీ.. ఇక తెలంగాణ లో సర్గికల్ స్ట్రైక్ చేస్తా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. అరేళ్లలో తెలంగాణలో ఏ రైతును ఆదుకున్న దాఖలాలు లేవు... ప్రజలను అడ్డుకొని.. పట్టించుకోని సీఎం.. మనకు అవసరం లేదు అన్నారు. అమరవీరుల ఆశయాలను తుంగలో తొక్కి .. పదవులతో జల్సాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.. ఆ మార్పు బీజేపీ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.


రోజుకి 500 మంది కలవాలని వస్తున్నారు

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>