Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/what-is-the-oversees-situation-of-solo-bathuke-so-better--21c9ff5d-a7d0-493b-902c-0e4c0d1e6d60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/what-is-the-oversees-situation-of-solo-bathuke-so-better--21c9ff5d-a7d0-493b-902c-0e4c0d1e6d60-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో ఒకటైన సినీ రంగంపై కరోనా ప్రభావం ఏవిధంగా ఉన్నదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినీ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు ఎంతో మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి బతుకు ఆగమ్యగోచరంగా తయారైంది. ఎన్నో సినిమాలు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. మరెన్నో సినిమాలు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంటే అవన్నీ ఓటీటీ ప్లాట్ ఫాం పై రిలీజైయ్యాయి. దాని ద్వారా హీరోలు, డైరెక్లర్లు పూర్తిగా నిరాశచెందారనే చెప్పుకోవచ్చు. అలాగే థియేటర్లు మూతపడటంతో థియేటర్లsai dhram tej;review;christmas;cinema;december;vegetable market;solo bathuke so betterఓవర్ సీస్ లో సినిమా లేటైతే.. ఇక అంతే సంగతులా ?ఓవర్ సీస్ లో సినిమా లేటైతే.. ఇక అంతే సంగతులా ?sai dhram tej;review;christmas;cinema;december;vegetable market;solo bathuke so betterSun, 20 Dec 2020 15:36:00 GMTఅయితే థియేటర్లలో 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో తెరవాలనే కండీషన్ ఉంది. దాంతో సినిమాకు రిటర్న్స్ వస్తాయో రావో అనే ఆలోచనతో.. థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి వెనకాడుతున్నారు స్టార్స్. అయితే తెలుగు సినిమాకు ఓవర్ సీస్ మార్కెట్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. దీనిలో కూడా ఇబ్బందులు వస్తాయనే అనుమానం కూడా ఉంది. దాంతో తెలుగు సినిమాలు ఓవర్ సీస్ లో కాకుండాఇండియాలోనే విడుదలైతే మా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే సినిమాను ముందుగా ఇండియలో విడుదల చేసి తర్వాత ఓవర్ సీస్ లో రిలీజ్ చేస్తే బుకింగ్స్ మీద ప్రభావం పడే అవకాశాలున్నాయి. దాంతో బుకింగ్స్ అన్ని పడిపోయినా పడిపోతాయి.

దీనితో పాటుగా రివ్యూస్, రేటింగ్స్, ఫైరసీల కారణంగా సినిమా ఓవర్ సీస్ లో లేట్ గా రిలీజ్ అయినా డిస్ట్రీబ్యూటర్లు ఘోరంగా నష్టాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది. కొంత మంది హీరోలు ఒకడుగు ముందుకు వేసి థియేటర్లలో తమ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. అందులో ఇలాంటి నష్టాలేమి లెక్కచేయకుండా సాయి ధరమ్ తన సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలు శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ పై విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ విషయంలో కూడా ఓవర్ సీస్ లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. సోలో బతుకే సో బెటర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ను బట్టే మిగతా సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తాయని అర్థమవుతోంది.




అభిమానులకు షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

అపర కుబేరుడికి అడుగు దూరంలో ఎలాన్ మాస్క్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని!

మోకాళ్లపై పవన్.. ఫ్యాన్స్ కోసం ఇలా చేసే హీరో పవర్ స్టార్ ఒక్కడే!

ఘోర ఓటమితో రవిశాస్త్రి, కోహ్లీలపై వేటు పడేనా..?

బీహార్‌లో ‘హెల్మెట్ మ్యాన్‘

చిరిగిన షూతో బౌలింగ్ చేసిన స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>