MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayasanthi97245e00-be26-4730-9042-5eff69687510-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayasanthi97245e00-be26-4730-9042-5eff69687510-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అలనాటి హిట్ పెయిర్స్‌లో మెగాస్టార్ చిరంజీవి - ‘రాములమ్మ’ విజయశాంతి కూడా ఒకటి. 1980 - 90 దశకాల్లో తెలుగు ప్రేక్షకులను ఈ జంట తమ కెమిస్ట్రీతో ఉర్రూతలు ఊగించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయిvijayasanthi;chiranjeevi;vijayashanti;ramu;tollywood;cinema;interview;silver;serviceచిరంజీవి ఆఫర్‌కు నో చెప్పిన రాములమ్మ.. కారణం ఏంటంటే..చిరంజీవి ఆఫర్‌కు నో చెప్పిన రాములమ్మ.. కారణం ఏంటంటే..vijayasanthi;chiranjeevi;vijayashanti;ramu;tollywood;cinema;interview;silver;serviceSat, 19 Dec 2020 16:44:54 GMTటాలీవుడ్ అలనాటి హిట్ పెయిర్స్‌లో మెగాస్టార్ చిరంజీవి - ‘రాములమ్మ’ విజయశాంతి కూడా ఒకటి. 1980 - 90 దశకాల్లో తెలుగు ప్రేక్షకులను ఈ జంట తమ కెమిస్ట్రీతో ఉర్రూతలు ఊగించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇంతలా రికార్డు స్థాయి విజయాలను అందుకున్న వేరే జంటలు చాలా అరుదు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు తగ్గిపోయాయి. వీరిద్దరి మద్య కొన్ని విభేదాలు వచ్చాయని, అందుకే ఈ హిట్ పెయిర్ ఎవరి దారి వారు చూసుకున్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకూ నటించలేదు. 2006 సంవత్సరంలో విజయశాంతి నాయుడమ్మ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఇటీవలే సుదీర్ఘ విరామానికి బ్రేక్ ఇచ్చిన ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కీలక పాత్రలో మెరిసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో విజయశాంతి మరిన్ని సినిమాలు చేయాలని ఫిలిం మేకర్స్, అభిమానులు కోరుకున్నారు. ఈ క్రమంలోనే రాములమ్మకు మెగాస్టార్ చిరంజీవి మూవీలో నటించే ఆఫర్ వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి.. చిరంజీవి సినిమా విషయమై స్పందించారు. ‘సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా మంది సినిమా ఆఫర్లతో నన్ను సంప్రదించారు. కాని నేను ఆసక్తి చూపించలేదు. చిరంజీవి సినిమాలో నటించాలని కూడా కొందరు అడిగారు. ఆయన సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని చెప్పారు. కానీ, నేను రాజకీయాలతో బిజీగా ఉన్నా.. అందుకే ఆ సినిమా చేయలేను అని చెప్పేశా. ఇక నేను మళ్లీ సినిమాల్లో నటించక పోవచ్చు’ అంటూ రాములమ్మ క్లారిటీ ఇచ్చింది. మరి మిమ్మల్ని వెండి తెరపై మళ్లీ చూడాలని అనుకుంటున్న అభిమానులకు ఏం చెప్తారు? అని ప్రశ్నించగా.. తాను రాజకీయాలతో ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని, కానీ సినిమాల వల్ల దీనికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే సినిమాలకు దూరం అవుతున్నానని విజయ శాంతి వివరించారు.


పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>