PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress-leaders-warning-on-revanth-issue754bfc6a-22d0-4970-b765-baa77c4f4ecd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-congress-leaders-warning-on-revanth-issue754bfc6a-22d0-4970-b765-baa77c4f4ecd-415x250-IndiaHerald.jpgతెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చిందో తెలియదు గానీ, ఇప్పుడు ఆ పదవి దక్కించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంతనాలు చేస్తుండగా, మరి కొంతమంది తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా, భారీగానే కసరత్తు చేస్తోంది. ఎవరికి పదవి ఇస్తే ఏమవుతుంది..? పrevanth reddy pcc president telangana sonia gandi;prabhakar;revanth;venkat;telangana;congress;chintamaneni prabhakar;ponnam prabhakar;mla;sangareddy;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;v;partyరేవంత్ కు పదవి వస్తే..? వీరంతా జంపే ?రేవంత్ కు పదవి వస్తే..? వీరంతా జంపే ?revanth reddy pcc president telangana sonia gandi;prabhakar;revanth;venkat;telangana;congress;chintamaneni prabhakar;ponnam prabhakar;mla;sangareddy;ponnam prabhakar goud;parakala prabhakar;reddy;v;partySat, 19 Dec 2020 07:00:00 GMTతెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చిందో తెలియదు గానీ, ఇప్పుడు ఆ పదవి దక్కించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంతనాలు చేస్తుండగా, మరి కొంతమంది తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా, భారీగానే కసరత్తు చేస్తోంది. ఎవరికి పదవి ఇస్తే ఏమవుతుంది..?  పార్టీకి ఎవరి వల్ల కలిసి వస్తుంది ? ఎవరెవరు పార్టీని వీడతారు అనేది లెక్కలు వేసుకుంటూ, మరి కొంతకాలం ఈ పదవి ని భర్తీ చేయకుండా వాయిదా వేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.



ఇది ఎలా ఉంటే కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు పదవి ఇవ్వరాదని, ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధిష్టానానికి హెచ్చరికలు పంపిస్తున్నారు. రేవంత్ కు కాకుండా తమలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా, అభ్యంతరం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ కు కనుక తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే, సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి వారు పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.



ఏది ఏమైనా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి విషయం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ పరిస్థితి తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న సమయంలో, నాయకుల మధ్య ఈ విధమైన పరిస్థితి ఏర్పడడం మరింత కంగారు పుట్టిస్తోంది.


స్పొర్ట్స్ : నేనెప్పుడు వాళ్ళని ఫాలో అవ్వను..అశ్విన్ !!

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>