PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/big-fire-accident-in-uttara-pradesh365be4e1-6e15-4e1c-8c0d-379662cbf1c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/big-fire-accident-in-uttara-pradesh365be4e1-6e15-4e1c-8c0d-379662cbf1c8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జంట జిల్లాలుగా పేరు గాంచిన కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో భారీ ప్రమాదాలు సంభవించాయి. మొదటగా గుంటూరు జిల్లా వినుకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. జిల్లాలోని వినుకొండ మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు పనులు ముగించుకొని స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారుaccident;auto;krishna river;andhra pradesh;district;police;mandalam;village;krishna district;local language;vinukondaజంట జిల్లాల్లో ఘొర ప్రమాదాలు!జంట జిల్లాల్లో ఘొర ప్రమాదాలు!accident;auto;krishna river;andhra pradesh;district;police;mandalam;village;krishna district;local language;vinukondaSat, 19 Dec 2020 21:50:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జంట జిల్లాలుగా పేరు గాంచిన కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో భారీ ప్రమాదాలు సంభవించాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... మొదటగా గుంటూరు జిల్లా వినుకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. జిల్లాలోని వినుకొండ మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు పనులు ముగించుకొని స్వగ్రామానికి ఆటోలో బయల్దేరారు.. ఈ క్రమంలో వినుకొండ మండలంలోని నవాజ్‌ కుంట వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 15 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 9 మంది స్పల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు స్థానిక వైద్యులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అలాగే ఇక కృష్ణా జిల్లా నూజివీడు మండలం శోభనాపురం గ్రామంలో  కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు  పూర్తిగా దగ్ధం అయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలో ఎవరూ కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటలు ఆపేందుకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ సంఘటనలో దాదాపు రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది అన్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ అవడం వల్లే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వెంటనే చేపట్టారు.




కన్న తల్లి చివరి కోరిక మేరకు కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసిన కుమార్తెలు!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>