PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/someone-has-to-move-forward-together1b260480-c367-4bb0-911d-0e2ae496728e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/someone-has-to-move-forward-together1b260480-c367-4bb0-911d-0e2ae496728e-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మొదట పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య కి అవకాశం ఇచ్చింది. అయితే అప్పట్లో కాంగ్రెస్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు టాక్. అప్పట్లో కేసీఆర్ ముందు పొన్నాల నిలబడలేక పోయారు. ఇక పార్టీలో నాయకత్వం అంతా... ఎవరి నియోజకవర్గంలో వారే పరిమితం అయ్యారు. అంతెందుకు పొన్నాల లక్ష్మయ్య కూడా తన సొంత నియోజకవర్గంలో మరో నాయకురాలితో ప్రచారం చెయించుకున్నారు. ఫలితాలు అందరికి తెలిసిందే. ఆ తరవత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ ని పీసీసీ గా ప్రకటించింది అధిష్ఠానం. someone has to move forward together;kcr;telangana;mohandas karamchand gandhi;congress;media;ponnala lakshmaiah;reddy;leader;partyఎవరైనా కలిసి మెలిసి ముందుకు సాగాల్సిందే..!ఎవరైనా కలిసి మెలిసి ముందుకు సాగాల్సిందే..!someone has to move forward together;kcr;telangana;mohandas karamchand gandhi;congress;media;ponnala lakshmaiah;reddy;leader;partySat, 19 Dec 2020 23:15:00 GMTకాంగ్రెస్ అనే కాదు... ఏ పార్టీకి అయినా టీం వర్క్ ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితి లో కాంగ్రెస్ కి చీఫ్ ఎవరైనా... కలిసి...కలుపుకుని పోవాల్సిన అవసరం తప్పనిసరి.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మొదట పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య కి అవకాశం ఇచ్చింది. అయితే అప్పట్లో కాంగ్రెస్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు టాక్. అప్పట్లో కేసీఆర్ ముందు పొన్నాల నిలబడలేక పోయారు. ఇక పార్టీలో నాయకత్వం అంతా... ఎవరి నియోజకవర్గంలో వారే పరిమితం అయ్యారు. అంతెందుకు పొన్నాల లక్ష్మయ్య కూడా తన సొంత నియోజకవర్గంలో మరో నాయకురాలితో ప్రచారం చెయించుకున్నారు. ఫలితాలు అందరికి తెలిసిందే. ఆ తరవత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ ని పీసీసీ గా ప్రకటించింది అధిష్ఠానం.

రెడ్డి ల పార్టీ కి... బీసీని పీసీసీ చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని పొన్నాల మీద మాట్లాడిన నాయకులు... ఉత్తమ్ పీసీసీ అయ్యాక... రెడ్లకు పగ్గాలు ఇస్తే ఏం చేశారు అంటూ సీనియర్లు మాట్లాడే వరకు వచ్చింది పరిస్థితి. హన్మంత రావు లాంటి సీనియర్లు మీడియా ముందే ప్రకటించారు. ఎవరి బలం ఎలా ఉన్నా... పీసీసీ చీఫ్ టీం లీడర్ మాత్రమే. టీం లో ఉన్న వాళ్ళు కూడా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ గడిచిన ఆరేళ్లలో ఇది ఏక్కడ కనిపించలేదు. పొన్నాల నుండి...ఉత్తమ్ వరకు ఇదే ఫెయిల్యూర్ అంశం. ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి..వరుస ఎన్నికలు...ఓటములు వెంటాడాయి. ఉత్తమ్ సరిగా డీల్ చేయలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మరో అంశం కూడా చర్చించాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఉన్నన్ని రోజులు...తాను గాంధీ భవన్ మెట్లె ఎక్కను అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు పీసీసీ రేసులో ఉన్నారు. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో.







పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా ముహూర్తం ఫిక్స్

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>