PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud8384ade-f7f4-427b-8e16-26ff21705c75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud8384ade-f7f4-427b-8e16-26ff21705c75-415x250-IndiaHerald.jpgప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఎంత అమితంగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే.. గత నలభై ఇళ్లనుంచి అయనకు రాజకీయాలు తప్పా వేరే ధ్యాసే లేదు. పొద్దున్న లేచిన దగ్గరినుంచి రాత్రి పాదుకే దాకా చంద్రబాబు పార్టీ గురించే ఆలోచన ఉండేది. అందుకే అయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు. గెలుపోటములు సహజమే అయినా అధికారంలో ఉంటె ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది.. chandrababu;kcr;jagan;andhra pradesh;telangana;kanna lakshminarayana;chief minister;party;coronavirusచంద్రబాబు ఫక్తు రాజకీయ నాయకుడు..ఇదే నిదర్శనం..?చంద్రబాబు ఫక్తు రాజకీయ నాయకుడు..ఇదే నిదర్శనం..?chandrababu;kcr;jagan;andhra pradesh;telangana;kanna lakshminarayana;chief minister;party;coronavirusSat, 19 Dec 2020 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఎంత అమితంగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే.. గత నలభై ఇళ్లనుంచి అయనకు రాజకీయాలు తప్పా వేరే ధ్యాసే లేదు. పొద్దున్న లేచిన దగ్గరినుంచి రాత్రి పాదుకే దాకా చంద్రబాబు పార్టీ గురించే ఆలోచన ఉండేది. అందుకే అయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు. గెలుపోటములు సహజమే అయినా అధికారంలో ఉంటె ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది..

గతంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ఈ సారి ప్రతిపక్షంలో ఉండడాన్ని ఎందుకో జీర్ణించుకోవడం లేదు. ప్రజలు ఘోరాతిఘోరంగా ఆయనను ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.. ఇప్పుడైనా కాస్త రాజకీయాలను వదిలి వేరే పనులేమైనా చేసుకుంటారా అంటే సీఎం జగన్ కన్నా ఎక్కువ రాష్ట్రం గురించి తలచుకుని బాధపడుతుంటారు.  నిజానికి చంద్రబాబు కు రాజకీయాలు తప్పా ఏవీ తెలియవు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యవసాయం అంటే ఇష్టం.. ఈ విషయం పలుమార్లు ఆయనే చెప్పి ఆచరించారు కూడా.. గతంలో ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తూ కాలం గడిపేవారు..

జగన్ కూడా పారిశ్రామికవేత్త కావడంతో అయన ఖాళీ సమయంలో ఆయా వ్యాపార లావాదేవీలను చూసుకుంటుంటారు.. అయితే ఇలాంటి అభిరుచులు, పనులు చంద్రబాబు కు ఏవీ లేదు.. అయన పుట్టిందే రాజకీయాలకోసం అన్నట్లు వ్యవహరిస్తుంటారు.  ఆయనకు వ్యాపారాలు లేవని కాదు. అవన్నీ కుటుంబ సభ్యులే చూసుకుంటారు. తన వ్యాపారాలు, ఆస్తుల విషయంలో చంద్రబాబు ఏనాడూ పట్టించుకోరు. గత ఏడు నెలలుగా కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నా చంద్రబాబు మాత్రం రాజకీయాలకే ఎక్కువ విలువ ఇస్తారు. ఫ్యామిలి ట్రిప్ కూడా ఎప్పుడో ఒకసారి వేస్తారు. పూర్తి కాలం రాజకీయాలు చేసేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు తప్ప మరెవ్వరూ లేరు. అందుకే ఆయన చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవుతారని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం.


వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన మంచు లక్ష్మి కూతురు

పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>