Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారి పోవడం తో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలకు దారి తీస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దేశ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలు అందరి చేత విమర్శల పాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశారు అని ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. imran;imran khan;indonesia;pakistan;poland;prime minister;nijamఇన్నాళ్ళకి ఇమ్రాన్ మంచి పని చేసాడు.. పాకిస్తాన్ లో విజయం..?ఇన్నాళ్ళకి ఇమ్రాన్ మంచి పని చేసాడు.. పాకిస్తాన్ లో విజయం..?imran;imran khan;indonesia;pakistan;poland;prime minister;nijamSat, 19 Dec 2020 01:00:00 GMTపాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశం గా మారి పోవడం తో పాటు తీవ్ర స్థాయి లో విమర్శల కు దారి తీస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దేశ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలు అందరి చేత విమర్శల పాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశారు అని ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.



 ఈ మధ్య  కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా ఆడవాళ్ళ పై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతూన్నాయన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలను  తగ్గించేందుకు కొన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు.  ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో మరింత కఠిన చట్టాలు అవసరం అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే ఇండోనేషియా పోలాండ్ దేశాల్లో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారికి కెమికల్స్ ఇచ్చి నపుంసకులుగా మార్చటం అనే చట్టం  ఉంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక ఇటీవల పాకిస్తాన్ కూడా ఇలాంటి తరహా చట్టం తీసుకువచ్చింది.  లాహోర్లో జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఇలాంటి తరహా చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇటీవలఇది చట్టరూపం దాల్చేందుకు దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతకం చేశారు.  ఇక ఇప్పటి నుంచి పాకిస్తాన్ లో ఎవరైనా ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడితే వారికి  రసాయనాలు ఇచ్చి నపుంసకులుగా మారుస్తారు. ఇది నిజంగానే ఒక మంచి నిర్ణయమని ఇక ఈ నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్ ఒక రకంగా విజయం సాధించారు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


వంశీని దాటి వెళ్ళడం కష్టమేనా?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>