MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-rashmi-got-best-telugu-anchor-award0b81c30e-fcb1-4c53-a27c-96dede1312e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-rashmi-got-best-telugu-anchor-award0b81c30e-fcb1-4c53-a27c-96dede1312e9-415x250-IndiaHerald.jpgజంతువులను ప్రేమించడమే కాదు.. వాటికి ఎవరైనా హాని కలిగిస్తే ఊరుకోరు రేష్మి. జంతువులపై కఠినంగా వ్యవహించే వారిని కడిగేస్తుంటారు. ట్విట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు రేష్మి. ఒక ఆవు దగ్గర ఉన్న లేగ దూడ తల్లిపాలు తాగకుండా దాని మూతికి బుట్ట కట్టడంపై రేష్మి స్పందించారు. అలా చేయడం ఎంత తప్పో మీ మనస్సాక్షిని అడగండి అంటూ ఫైర్ అయ్యారు.reshmi;ktr;prema;reshmi;telangana;jabardasth;media;cm;twitter;love;dogsతల్లి పాలు త్రాగకుండా అలా చేయటం ఎంత తప్పో...- యాంకర్ రేష్మి!తల్లి పాలు త్రాగకుండా అలా చేయటం ఎంత తప్పో...- యాంకర్ రేష్మి!reshmi;ktr;prema;reshmi;telangana;jabardasth;media;cm;twitter;love;dogsSat, 19 Dec 2020 10:30:00 GMTఈటీవీ ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన ప్రముఖ యాంకర్, నటి రేష్మీగౌతం జంతు ప్రేమికురాలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో చాలా వరకు జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వీధి కుక్కలను సైతం ఆమె ఎంతగానో ప్రేమిస్తారు. ఒక వీధి కుక్క గాయపడినట్టు రేష్మి చూస్తే దానికి వైద్యం చేయకుండా వదిలిపెట్టరు. అంత ప్రేమ జంతువులంటే ఆమెకు. లాక్‌డౌన్ సమయంలోనూ వీధి కుక్కల ఆకలి తీర్చారామే. వాటికి ఆహారం అందించాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. జంతువులను ప్రేమించడమే కాదు.. వాటికి ఎవరైనా హాని కలిగిస్తే ఊరుకోరు రేష్మి. జంతువులపై కఠినంగా వ్యవహించే వారిని కడిగేస్తుంటారు. ట్విట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు రేష్మి. ఒక ఆవు దగ్గర ఉన్న లేగ దూడ తల్లిపాలు తాగకుండా దాని మూతికి బుట్ట కట్టడంపై రేష్మి స్పందించారు. అలా చేయడం ఎంత తప్పో మీ మనస్సాక్షిని అడగండి అంటూ ఫైర్ అయ్యారు.
 



హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్‌లో ఉన్న గోశాల వద్ద ఒక ఆవు, లేగదూడను కట్టి ఉంచారు. అయితే, ఆ లేగదూడ తల్లిపాలు తాగకుండా మూతికి బుట్ట కట్టారు. ఇది చూసిన ఒక జంతు ప్రేమికుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టారు. ‘అత్యంత క్రూరత్వం’ అని ఇంగ్లిష్‌లో క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ట్వీట్‌లో కేటీఆర్, తెలంగాణ సీఎంఓ, మేనకా గాంధీని ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మరో యూజర్ రేష్మిని ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌కు రేష్మి స్పందించారు. ‘‘తల్లిపాలు తాగడానికి ఎవరు ఎక్కువ అర్హులు??? మనమా లేకపోతే దూడనా.. మీరు ఏది ఎంపిక చేసుకున్నా కచ్చితంగా అది మీ మనస్సాక్షి భారం కాకుండా చూసుకోండి’’ అని పేర్కొన్నారు.



" style="height: 391px;">




భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?

చట్టసభల్లోని నేరచరితుల ఓటు చెల్లుబాటుపై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు !

పూరీ హోస్ట్ గా ప్రముఖ న్యూస్ చానల్ టాక్ షో ?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>