Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vanitha-vijay-kumar-shared-a-post-that-she-felt-in-love-for-the-fourth-time3b65df92-5e2b-4be1-b8a2-941d833315e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vanitha-vijay-kumar-shared-a-post-that-she-felt-in-love-for-the-fourth-time3b65df92-5e2b-4be1-b8a2-941d833315e8-415x250-IndiaHerald.jpgప్రేమ.. ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేస్తుంది. కలకాలం కలిసుండేలా చేస్తుంది. అంతేకాదు ప్రేమ ఎంత గాఢంగా ఉంటే.. వారిద్దరి మధ్య బంధం అంత బలంగా ఉంటుంది. అయితే ప్రేమ ఒక్కసారే పుడుతుందని, ఎవరినైతే ప్రేమించామో.. వారిని జీవితాంతం మర్చిపోలేమని..fourth love;women;kumaar;manjula;prema;tara;vijay;media;tamil;marriage;love;tamilnadu;wife;instagram;heroine;joseph vijay;nijam;masterవామ్మో..! ఆ హీరోయిన్ ఐదోసారి ప్రేమలో పడిందట!వామ్మో..! ఆ హీరోయిన్ ఐదోసారి ప్రేమలో పడిందట!fourth love;women;kumaar;manjula;prema;tara;vijay;media;tamil;marriage;love;tamilnadu;wife;instagram;heroine;joseph vijay;nijam;masterSat, 19 Dec 2020 13:58:00 GMTప్రేమ ఎంత గాఢంగా ఉంటే.. వారిద్దరి మధ్య బంధం అంత బలంగా ఉంటుంది. అయితే ప్రేమ ఒక్కసారే పుడుతుందని, ఎవరినైతే ప్రేమించామో.. వారిని జీవితాంతం మర్చిపోలేమని చెబుతారు కవులు. కానీ తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ హీరోయిన్‌ మాత్రం ఏకంగా నాలుగు సార్లు ప్రేమలో పడింది.

ప్రేమించిన నలుగురిలో ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిగా పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఎవరితోనూ జీవితాన్ని మాత్రం పూర్తిగా పంచుకోలేకపోయింది. దీంతో ముగ్గురితోనూ విడిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోని ఆమె తాజాగా ఐదోసారి ప్రేమలో పడినట్లు ప్రకటించింది. ఇంతకీ ఆమె ఎవరంటారా..? తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల కుమార్తె వనితా విజయ్ కుమార్.

2000లో నటుడు ఆకాష్‌ను పెళ్లాడిన వనిత.. ముగ్గురు పిల్లలు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. 2007లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఐదేళ్లకు కాపురం చేసి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ళు సహజీవనం చేసి 2017లో అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ ఏడాది లాక్‌డౌన్ సమయంలో పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. అయితే పీటర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లాడటం వివాదాస్పదమైంది.

ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌కి వెళ్లిన చోట గొడవ జరిగింది. దీంతో పీటర్ వనితను వదిలేసి మొదటి భార్య వద్దకు వెళ్లిపోయాడు. తాజాగా తాను మరోసారి ప్రేమలో పడినట్లు వనిత ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘మళ్ళీ ప్రేమలో పడ్డాను. ఇప్పుడు మీరు హ్యాపీనా?’ అంటూ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు. అయితే వనిత నిజంగానే ప్రేమలో పడిందా? లేక తనను విమర్శించే వాళ్లకు కౌంటర్‌గా పోస్ట్ చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే దేవి సినిమాతో వనిత విజయ్ కుమార్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌‌గా అడుగుపెట్టింది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం కొన్ని సీరియళ్లలో కూడా నటిస్తోంది.

">




వెంకటేష్ కు బాగానే వర్కవుట్ అయిందిగా...

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>