PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan-shocking-decision-over-tdp-mlas4220c92f-aa01-451c-8667-7bc7a6e4a7bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan-shocking-decision-over-tdp-mlas4220c92f-aa01-451c-8667-7bc7a6e4a7bc-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తూ.. త‌మ‌కు మూడుకు సంబంధం లేద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాజ‌ధాని విష‌యం జ‌గ‌న్ ప‌రిధిలోద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, విభ‌జ‌న చ‌ట్టంలో `ఏ-క్యాపిట‌ల్‌` అంటే ఒక‌టే కాద‌ని.. ఎన్న‌యినా.. అని అన్వ‌యించుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఇది జ‌గ‌న్ స‌ర్కారుకు ఒకింత ఆక్సిజ‌న్ అందించిన‌ట్ట‌యింది. త‌మ‌కు తీవ్ర ఇబ్బంది క‌రంగా మారిన హైకోర్టు తీర్పుల విష‌యంలో కేంద్రానికి ఫిర్యాదుల చేయ‌డం వ‌ల్లే.. ప్ర‌స్తుతం హైకోర్టు ప్ర‌ధాన మూర్తిని బ‌దిలీjagan centre;bharatiya janata party;andhra pradesh;high court;court;minister;october;letter;central governmentజ‌గ‌న్‌కు అనుకూలంగా కేంద్రం అడుగులు... వీళ్ల‌కు షాక్ కొట్టిన‌ట్ల‌య్యిందా...!జ‌గ‌న్‌కు అనుకూలంగా కేంద్రం అడుగులు... వీళ్ల‌కు షాక్ కొట్టిన‌ట్ల‌య్యిందా...!jagan centre;bharatiya janata party;andhra pradesh;high court;court;minister;october;letter;central governmentSat, 19 Dec 2020 08:58:49 GMTఏపీ సీఎం జ‌గ‌న్‌కు అనుకూలంగా కేంద్రం అడుగులు వేస్తోందా? ప‌్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు దేనికి సంకేతంగా ఉన్నాయి?  పోల‌వ‌రం విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కోర్టుల నుంచి ఎదుర‌వుతున్న ప‌లు విష‌యాల్లో జ‌గ‌న్‌కు కేంద్రం నుంచి సానుకూల నిర్ణ‌యాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని తీసుకుంటే.. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు.. గ‌గ్గోలు పెట్టాయి. పెడుతున్నాయి. ఇక‌, ఈ విష‌యంపై హైకోర్టులో కేసులు కూడా దాఖ‌ల‌య్యాయి. వీటిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. తీవ్రంగా నే వ్యాఖ్యానించింది.

ఈ క్ర‌మంలోనే కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తూ.. త‌మ‌కు మూడుకు సంబంధం లేద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాజ‌ధాని విష‌యం జ‌గ‌న్ ప‌రిధిలోద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, విభ‌జ‌న చ‌ట్టంలో `ఏ-క్యాపిట‌ల్‌` అంటే ఒక‌టే కాద‌ని.. ఎన్న‌యినా.. అని అన్వ‌యించుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఇది జ‌గ‌న్ స‌ర్కారుకు ఒకింత ఆక్సిజ‌న్ అందించిన‌ట్ట‌యింది. త‌మ‌కు తీవ్ర ఇబ్బంది క‌రంగా మారిన హైకోర్టు తీర్పుల విష‌యంలో కేంద్రానికి ఫిర్యాదుల చేయ‌డం వ‌ల్లే.. ప్ర‌స్తుతం హైకోర్టు ప్ర‌ధాన మూర్తిని బ‌దిలీ చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే.. కేంద్రానికి-హైకోర్టు సీజే బ‌దిలీకి మ‌ధ్య ప్ర‌త్య‌క్ష సంబంధం లేదు.

కానీ, ప‌రోక్షంగా కొలీజియం కూడా కేంద్రాన్ని సంప్ర‌దించే ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని న్యాయ శాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా ఒక‌ర‌కంగా జ‌గ‌న్‌కు కేంద్రం స‌హ‌క‌రించింద‌నే వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తోంది. మ‌రోవైపు.. సుప్రీం కోర్టు తాజా తీర్పు కూడా జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశమిచ్చింది.

అయితే, ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న ఏపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో జ‌గ‌న్ సు ప్రీంకు వెళ్ల‌గా.. ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కాగ్ నివేదిక‌లోనూ.. రాష్ట్రం లో అభివృద్ధి ప‌నులు జోరుగా సాగుతున్నాయ‌ని..అ నేక కీల‌క ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న రాష్ట్రంగా ఏపీని ఆకాశానికి ఎత్తేసింది. ఇక‌, క‌రోనా విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నేరుగా ప్ర‌స్తుతించారు. ఇలా.. కేంద్రం జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉండ‌డం.. రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు రుచించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా అయితే..తామెలా స్పందిస్తామ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.  


బీజేపీలోకి వరదలా చేరికలు

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>