Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan3f68318e-9d8b-4ddb-aeef-cb384a99e72f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan3f68318e-9d8b-4ddb-aeef-cb384a99e72f-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే చాలు.. ఆయన అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం పొంగుతుంది. తీసినవి తక్కువ సినిమాలే అయినా, ఎక్కవ హిట్లు లేకపోయినా తెలుగు తెరపై పవన్ కళ్యాణ్‌కు ఉన్న అభిమానుల సంఖ్య మాత్రం కోట్లలో..pawan kalyan;pawan;kalyan;pawan kalyan;bollywood;tollywood;cinema;interview;audio;attharintiki darediపవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!pawan kalyan;pawan;kalyan;pawan kalyan;bollywood;tollywood;cinema;interview;audio;attharintiki darediSat, 19 Dec 2020 16:43:41 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే చాలు.. ఆయన అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం పొంగుతుంది. తీసినవి తక్కువ సినిమాలే అయినా, ఎక్కవ హిట్లు లేకపోయినా తెలుగు తెరపై పవన్ కళ్యాణ్‌కు ఉన్న అభిమానుల సంఖ్య మాత్రం కోట్లలో ఉంటుంది. ఆయనంటే ఇక్కడ అంత పిచ్చి. ముఖ్యంగా యువతకు ఆయనో రోల్ మోడల్. ఆయన ఫాలోయింగ్ చూసి టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, హీరోయిన్లే ఇప్పటివరకు షాకయ్యేవారు. ఇప్పుడు ఇది బాలీవుడ్‌కు కూడా పాకిందట. పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి బాలీవుడ్ స్టార్ నటులు సైతం నోరెళ్లబెడుతున్నారట.

బొమన్ ఇరానీ.. బాలీవుడ్‌లో ఫేమస్ నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా చేసేయగలడు. అలాంటి బొమన్ ఇరానీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సందర్భంగా టాలీవుడ్ గురించి ఆయన అభిప్రాయాన్ని అడగ్గా.. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌ ది బెస్ట్ అని, అక్కడ ఆయనకున్న క్రేజ్ చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందేనని చెప్పారు. ‘నేను పవన్‌ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞ్యాతవాసి’ సినిమాల్లో నటించాను. వాటిలో ఏదో ఓ ఆడియో ఈవెంట్‌కు నేనూ హాజరయ్యాను. అక్కడ పవన్ ఫ్యాన్స్ కేకలు విని నేను ఆశ్చర్యపోయాను. ఇక మైక్ పవన్ చేతికెళ్లగానే ఫ్యాన్స్ కేకలు ఆకాశాన్నంటాయి. అది చూసి నేను స్టన్ అయిపోయాను’ అని బొమన్ ఇరానీ చెప్పుకొచ్చారు.

అయితే పవన్ కళ్యాణ్‌లో ఆ అహంకారం కొంచెం కూడా ఉండదని, సెట్స్‌లో చాలా హుందాగా, సైలెంట్‌గా ఉంటారని, తోటి నటీనటులతో ఎంతో మర్యాదగా నడుచుకుంటారని వివరించారు. అత్తారింటికి దారేది సినిమా టైంలో తామిద్దరికీ పెద్దగా సీన్స్ లేకపోయినా పవన్ తనకు థాంక్స్ చెప్పారని వెల్లడించారు. ఎప్పుడో ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ తెగ హ్యాపీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత మరికొన్ని ప్రాజెక్టులను కూడా పవన్ లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.


ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా

రీమేక్ లకి టెంప్ట్ అవని తెలుగు హీరోలు వీరే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>