PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcr3c34d6b3-4b45-4437-bf07-6628ee8cd065-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcr3c34d6b3-4b45-4437-bf07-6628ee8cd065-415x250-IndiaHerald.jpgవ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న స్లాట్‌ బుకింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 21 నుంచి సీఏఆర్‌డీ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు జరపుతామని ప్రకటించింది.kcr;dharani;telangana;december;king;king 1;aadharవ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌కు బ్రేక్వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌కు బ్రేక్kcr;dharani;telangana;december;king;king 1;aadharSat, 19 Dec 2020 19:59:00 GMTతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపనున్నట్లు తెలిపింది.  ప్రస్తుతం కొనసాగుతున్నటు వంటి  నూతనంగా చేపట్టిన స్లాట్‌ బుకింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక డిసెంబర్ 21 (సోమవారం) నుంచి సీఏఆర్‌డీ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్ )విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి మాత్రం యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని పేర్కొంది.

 కాగా డిసెంబర్ 11న స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభం అయిన విషయం తెల్సిందే. డిసెంబర్ 14 నుంచి రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌, కులం, వ్యక్తిగత వివరాలను నమోదు చేయడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ధరణి విషయంలో సర్కార్‌ తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని ఫైర్ అయింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ అడగొద్దని ఆదేశించింది. దీంతో కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పాత పద్ధతిలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఆస్తుల నమోదు కోసం ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ లు ఎమ్మార్వో కార్యాలయాల్లో  ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ లపై అభ్యంతరాలు తలెత్తడంతో ప్రభుత్వం పాత పద్ధతిలోనే  రిజిస్ట్రేషన్‌లు చేయడానికి మొగ్గు చూపింది. 


కోహ్లీకి బ్యాడ్ ఇయర్‌గా 2020

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>