PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerrajua5ae67e8-7cc4-4149-9a97-e50eb69395ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerrajua5ae67e8-7cc4-4149-9a97-e50eb69395ce-415x250-IndiaHerald.jpgకర్నూలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నీటి విషయంలో రాయలసీమ కు అన్యాయం జరుగుతోంది అని ఆయన అన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టిడిపిలోకి చేరినప్పుడు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల కోసం జారీ చేసిన జీవోలు అమలు కాలేదు అని ఆయన ఆరోపించారు. రాయలసీమలోని ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అన్నారు. పోలవరం మాదిరిగా రాయలసీమ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. సీమ ప్రాజెsomuveeraju;amala akkineni;prakash reddy;surya sivakumar;bharatiya janata party;jagan;kurnool;media;rayalaseema;capital;aqua;thief;central government;reddy;thopudurthy prakash reddy;mantraచంద్రబాబు ఉన్నప్పుడే బెస్ట్ అన్న సోము...! ఇది ఏంటి గురు...?చంద్రబాబు ఉన్నప్పుడే బెస్ట్ అన్న సోము...! ఇది ఏంటి గురు...?somuveeraju;amala akkineni;prakash reddy;surya sivakumar;bharatiya janata party;jagan;kurnool;media;rayalaseema;capital;aqua;thief;central government;reddy;thopudurthy prakash reddy;mantraSat, 19 Dec 2020 10:00:00 GMTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నీటి విషయంలో రాయలసీమ కు అన్యాయం జరుగుతోంది అని ఆయన అన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టిడిపిలోకి చేరినప్పుడు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల కోసం జారీ చేసిన జీవోలు అమలు కాలేదు అని ఆయన ఆరోపించారు. రాయలసీమలోని ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అన్నారు. పోలవరం మాదిరిగా రాయలసీమ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి  అని డిమాండ్ చేసారు.

సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం కర్నాటకతో చర్చలు జరపాలి అని ఆయన సూచించారు. పదివేల కోట్లు విడుదల చేసి మూడేళ్లలో సీమలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రం రాయలసీమలో చేసిన అభివృద్ధిని జగన్ ప్రభుత్వం దాచుతోంది అని ఆరోపించారు. క్యాపిటల్ కోసం చంద్రబాబు పెట్టిన ఏడువేల రెండు వందల కోట్లపై రెఫరండం పెట్టాలి అని కోరారు. అదేవిధంగా రాయలసీమపై కూడా రెఫరండం పెట్టాలి అన్నారు. అవినీతి బయటకు రాకుండా చంద్రబాబు, జగన్ తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు.

చంద్రబాబు పాలనలో ఇసుక చౌకగా దొరికింది. జగన్ పాలనలో.. షాప్ లో ఈజీగా బంగారు దొరుకు తుంది. కానీ ఇసుక దొరకడం లేదు అని ఆయన అన్నారు. ప్రభుత్వం రాయలసీమలోని ఎర్రచందనాన్ని స్మగ్లర్లకు వదిలేసింది అని ఆయన ఆరోపించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ వెనక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు అని ఆయన ఆరోపించారు. ఎర్రచందనం అమ్మగా వచ్చిన డబ్బులతో రాయలసీమను అభివృద్ధి చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి బీజేపీ మద్దతు ఇవ్వదు అన్నారు. జనసేనతో తప్ప బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేసారు. అధికారం మాకు ఇవ్వండి రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తాం అన్నారు.


ఆర్ ఆర్ ఆర్ షూట్ కన్నా అందుకే ఖర్చు ఎక్కువా?

చట్టసభల్లోని నేరచరితుల ఓటు చెల్లుబాటుపై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు !

పూరీ హోస్ట్ గా ప్రముఖ న్యూస్ చానల్ టాక్ షో ?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>