PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-palning-to-old-jonal-system-e3ddbb49-2630-4df3-aa99-8cbfeb3bcf79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-palning-to-old-jonal-system-e3ddbb49-2630-4df3-aa99-8cbfeb3bcf79-415x250-IndiaHerald.jpgతెలంగాణ సర్కార్ ఇటీవలే ఉద్యోగ నియామకాల ప్రకటన చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల కొలువులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జోనల్ సిస్టమ్ పై క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలనేదాని మీద ఉన్నతాధికారులు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. tspsc;kcr;amala akkineni;telangana;district;husband;local languageపాత జోనల్ విధానంలో ఉద్యోగాల భర్తీ?పాత జోనల్ విధానంలో ఉద్యోగాల భర్తీ?tspsc;kcr;amala akkineni;telangana;district;husband;local languageSat, 19 Dec 2020 08:27:31 GMTతెలంగాణ సర్కార్ ఇటీవలే ఉద్యోగ నియామకాల ప్రకటన చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల కొలువులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జోనల్ సిస్టమ్ పై క్లారిటీ లేకపోవడంతో
ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలనేదాని మీద ఉన్నతాధికారులు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. కొత్త జోనల్ సిస్టమ్ ఇంకా అమలులోకి రానందున.. ప్రస్తుతానికి పాత జోనల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన నియామకాలకు సంబంధించి లీగల్ సమస్యలు తలెత్తాయి. ఈసారి అలాంటి చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారని చెబుతున్నారు.


పాత జోనల్ వ్యవస్థ ప్రకారం పది పాత జిల్లాల ప్రాతిపదికన ఆయా పోస్టులకు స్థానిక రిజర్వేషన్ ఉంటుంది. కొత్త జోనల్ వ్యవస్థలో 33 జిల్లాలు ఉన్నందున స్థానిక రిజర్వేషన్ 95% ఉంటుంది. వికారాబాద్ జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తుందనే వివాదం ఇంకా  తేల లేదు. కేసీఆర్ సర్కార్ సూచించిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. గతంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరిగింది. కొత్త జోనల్ వ్యవస్థతో జిల్లాల సంఖ్య విషయంలో చిక్కులు మాత్రమే కాక రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు 2018 ఆగస్టులో వచ్చినా ఇప్పటికీ దాని ప్రకారం పోస్టుల పునర్ వ్యవస్థీకరణ జరగలేదు.ఇప్పుడు 33 జిల్లాలు అయినందున, కొత్తగా వచ్చిన రెండు జిల్లాలు ఏ జోన్‌లోకి వెళ్తాయనే సమస్య వచ్చిపడింది.

కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఏ జోన్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో నిర్ధారించడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ప్రస్తుతానికి పాత జోనల్ వ్యవస్థ ప్రాతిపదికనే భర్తీ ఉండొచ్చని తెలుస్తోంది.
కొత్త జోనల్ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినప్పటికీ ‘మూడేళ్ల గడువు’ అనే నిబంధనతో పాత జోనల్ వ్యవస్థనే అమలుచేసే వెసులుబాటు ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తూ కోసం టెట్ నిర్వహించడం అనివార్యం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువడడానికి ముందే టెట్ ప్రకటన రావాల్సి ఉంటుంది. కాబట్టి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల రావొచ్చని తెలుస్తోంది.  




సమంతని ఫాలో అవుతున్న ఎన్టీఆర్ సక్సెస్ అవుతాడా...?

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>