PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tollywood-acters-praised-ap-cm-jagan-mohan-reddy1b8e3283-5c11-4fc8-b6d9-db63ba53ef52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tollywood-acters-praised-ap-cm-jagan-mohan-reddy1b8e3283-5c11-4fc8-b6d9-db63ba53ef52-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమకు రాయితీలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం తన నిర్ణయంతో లాక్‌డౌన్‌ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని నటుడు నాగబాబు అన్నారు. tollywood;manchu manoj kumar;jagan;andhra pradesh;tollywood;industries;cinema;media;chief minister;social media;film industry;minister;letterజగన్ కు టాలీవుడ్ ప్రముఖుల ధన్యవాదాలుజగన్ కు టాలీవుడ్ ప్రముఖుల ధన్యవాదాలుtollywood;manchu manoj kumar;jagan;andhra pradesh;tollywood;industries;cinema;media;chief minister;social media;film industry;minister;letterSat, 19 Dec 2020 20:26:10 GMTముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు.  సీఎం తన నిర్ణయంతో లాక్‌డౌన్‌ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని నటుడు నాగబాబు అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చొరవతో మూవీ ఇండస్ట్రీకి జవసత్వాలు చేకూరుతాయంటూ నాగబాబు ట్వీట్‌ చేశారు.

 ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నిర్ణయం హర్షణీయం! విపత్కర సమయంలో ఇలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ థాంక్యూ. తెలుగు సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవంతో వెలిగిపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి. సినిమా మళ్లీ ట్రాక్‌లో పడుతోంది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం పట్ల సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు.

‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా లబ్ది చేకూరుతుంది. ఇలాంటి గొప్ప నిర్ణయం వల్ల కోవిడ్‌ మహమ్మారితో చితికిపోయిన పరిశ్రమ తిరిగి నిలదొక్కుకుంటుంది’’ అని టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు. సరైన సమయంలో స్పందించి వరాల జల్లు కురిపించిన జగనన్న చొరవ, నాయకత్వం అమోఘం అని ఇక మంచు మనోజ్ అన్నారు.

థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని తెలిపింది. దీంతో సినీ ప‍్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.




శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>