PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-chief-for-telangana-congress492a3cd3-286f-4929-9932-e5de0896db0d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-chief-for-telangana-congress492a3cd3-286f-4929-9932-e5de0896db0d-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ అంతా పీసీసీ నియామకం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఉత్తమ్ రాజీనామా తర్వాత... కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్ అభిప్రాయ సేకరణ చేసి రాహుల్ని కలిసి వివరాలు అందించారు. మొత్తం 162 మంది అభిప్రాయాలు సేకరించారు. ఇక పీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్న వారిలో ప్రధానంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్లు రేసులో ఉన్నాయి. పీసీసీ పోటీ..ఈ ముగ్గురి మధ్యనే ఉంది. new chief for telangana congress;revanth;telangana;revanth reddy;congress;mp;రాజీనామా;district;mallu bhatti vikramarka;reddy;partyతెలంగాణ కాంగ్రెస్ కి కొత్త చీఫ్ !తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త చీఫ్ !new chief for telangana congress;revanth;telangana;revanth reddy;congress;mp;రాజీనామా;district;mallu bhatti vikramarka;reddy;partySat, 19 Dec 2020 20:31:46 GMTతెలంగాణ కాంగ్రెస్ అంతా పీసీసీ నియామకం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఉత్తమ్ రాజీనామా తర్వాత... కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్ అభిప్రాయ సేకరణ చేసి  రాహుల్ని కలిసి వివరాలు అందించారు. మొత్తం 162 మంది అభిప్రాయాలు సేకరించారు. ఇక పీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్న వారిలో  ప్రధానంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్లు రేసులో ఉన్నాయి. పీసీసీ పోటీ..ఈ ముగ్గురి మధ్యనే ఉంది.

ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ చేసిన అభిప్రాయ సేకరణ లో... పీసీసీ ప్రధాన కార్యదర్శులు... మాజీ ఎంపీల అభిప్రాయం సేకరణ మెజారిటీ నాయకులు రేవంత్ రెడ్డి పేరును ప్రధానంగా చెప్పినట్టు సమాచారం. జిల్లా అధ్యక్షుల అభిప్రాయ సేకరణలో రేవంత్ ప్రస్తావన కూడా ఎక్కువే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ను కూడా పార్టీ లో సీనియర్లు సూచించారు. ఎన్ యస్ యూఐ నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పీసీసీ ఇవ్వడంతో.. పార్టీలో ఉంటూ.. కష్టపడిన వారికి పదవి వస్తుందనే సంకేతం క్యాడర్ కి వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. డీసీసీ అధ్యక్షుల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును కొద్దీ మంది సూచించినట్టు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం కి కాకుండా...దళిత్య సామాజిక వర్గంకు పీసీసీ ఇవ్వాలి వస్తే... అనే దానిపై కూడా అభిప్రాయ సేకరణ జరిగినట్టు సమాచారం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సీఎల్పీ గా ఉన్న భట్టి కి పీసీసీ అవకాశం ఇస్తే...ఎలా ఉంటుంది..? ఆ సామాజిక వర్గం పార్టీ వైపు వస్తుంది కదా...? అనే లెక్కలు కూడా వేస్తున్నారు.

ఇప్పటికి పూర్తిగా ఓ అభిప్రాయానికి రాలేకపోయినా...  రేవంత్ రెడ్డి...కోమటిరెడ్డి వెంకటరెడ్డి... భట్టి విక్రమార్క ముగ్గురు పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలో పీసీసీ ఇవ్వాల్సి వస్తే... రేవంత్ రెడ్డి... కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రధానంగా ఉన్నాయి. రెడ్డిల్లో ఎవరికి ఇస్తే... తర్వాత జరిగే రాజకీయ పరిణామాలపై కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. రెడ్డి యేతరుల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి తనకు తాను పీసీసీ కావాలని ఆడిగారా..? అనే దానికంటే సామాజిక సమీకరణాల్లో భట్టి పేరు ముందుకు వచ్చినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.





అచ్చెన్న ఓకే కానీ డోస్ సరిపోలేదు..ఇంకేమైనా చేయాలి...?

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>