Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi-farmers-agitations-delhi-punjab-haryana-ndaf3ffa5f0-8ed5-40f2-8b51-c5776debfeaf-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో రైతులు ఉద్యమబాట పట్టారు అనే విషయం తెలిసిందే. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు రైతులు. ఇక రైతులు చేపడుతున్న ఉద్యమానికి ఇప్పటికే ప్రతిపక్ష విపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి అన్న విfarmers;deva;satya;delhi;haryana - chandigarh;government;capital;cycle;central governmentవయసు 60 ఏళ్లు.. వెయ్యి కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వచ్చి.. చివరికి ఢిల్లీ సరిహద్దుల్లో..?వయసు 60 ఏళ్లు.. వెయ్యి కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వచ్చి.. చివరికి ఢిల్లీ సరిహద్దుల్లో..?farmers;deva;satya;delhi;haryana - chandigarh;government;capital;cycle;central governmentSat, 19 Dec 2020 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో రైతులు ఉద్యమబాట పట్టారు అనే విషయం తెలిసిందే. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు రైతులు.  ఇక రైతులు చేపడుతున్న ఉద్యమానికి ఇప్పటికే ప్రతిపక్ష విపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న నిరసనలు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడ సద్దుమణిగేలా మాత్రం కనిపించడం లేదు



 మొన్నటికి మొన్న రైతు సంఘాలు కేంద్రంతో చర్చలు జరిపినప్పటికీ అవి కూడా సఫలీకృతం కాకపోవడంతో రైతుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది అయితే రైతుల ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతూనే ఉంది అనే చెప్పాలి.  ఇప్పటికే ఎంతో మంది రైతులు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో తమ కుటుంబాలతో కలిసి ఉద్యమం చేపడుతూ జీవిస్తూ ఉంటే ఇకదేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా రైతులు తరలివస్తు ప్రస్తుతం రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో రోజు రోజుకు రైతుల ఉద్యమం కాస్తా తీవ్రరూపం దాలుస్తోంది.



 ఎన్నో కష్టనష్టాలు ఓర్చి  మరి రైతులు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి చేరుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. తాజాగా బీహార్కు చెందిన 60ఏళ్ల రైతు ఏకంగా వెయ్యి కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చి  రైతు ఉద్యమంలో పాలు పంచుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. సివాన్  కు చెందిన సత్య దేవ అనే  60 ఏళ్ల రైతు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఏకంగా 11 రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఢిల్లీ హర్యానా సరిహద్దులో రైతులు చేపడుతున్న ఉద్యమంలో పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకూ తాము ఇక్కడి నుంచి వెనక్కి తగ్గేది లేదు అంటూ ఈ సందర్భంగా రైతులు తెలిపారు.


బీజేపీలోకి వరదలా చేరికలు

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>