PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-rectifying-his-mistakes-for-upcoming-electionsc441bf8f-f5c5-431b-9174-a4f814d23af5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-rectifying-his-mistakes-for-upcoming-electionsc441bf8f-f5c5-431b-9174-a4f814d23af5-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల బరిలో జరిగిన తప్పుల్ని సీఎం కేసీఆర్ సరిదిద్దుకుంటున్నారు. హైదరాబాద్ వరదసాయం పంపిణీ విషయంలో ఎన్నికల కోడ్ అడ్డు రావడం టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టింది. నెపం బీజేపీపైకి నెట్టాలని చూసినా కూడా ప్రజలు అంగీకరించలేదు. వరద సాయం అందకపోవడంతో పేదలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్ఎస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఈసారి ఆ తప్పు రిపీట్ కాకూడదని భావిస్తున్నారు కేసీఆర్. kcr;kcr;nagarjuna akkineni;hyderabad;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;telangana;school;assembly;traffic police;central governmentగ్రేటర్ ఎన్నికల తప్పులు దిద్దుకుంటున్న కేసీఆర్..గ్రేటర్ ఎన్నికల తప్పులు దిద్దుకుంటున్న కేసీఆర్..kcr;kcr;nagarjuna akkineni;hyderabad;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;telangana;school;assembly;traffic police;central governmentSat, 19 Dec 2020 12:00:00 GMTకేసీఆర్ సరిదిద్దుకుంటున్నారు. హైదరాబాద్ వరదసాయం పంపిణీ విషయంలో ఎన్నికల కోడ్ అడ్డు రావడం టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టింది. నెపం బీజేపీపైకి నెట్టాలని చూసినా కూడా ప్రజలు అంగీకరించలేదు. వరద సాయం అందకపోవడంతో పేదలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్ఎస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఈసారి ఆ తప్పు రిపీట్ కాకూడదని భావిస్తున్నారు కేసీఆర్.

త్వరలో రాష్ట్రంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోడ్ ‌కు ముందే కొలువుల జాతరకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. న్యాయపరమైన వివాదాలు రాకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది పోలీస్ శాఖ.

ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుకు ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు గడువు ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చేసరికి మరో 2 వారాలు పడుతుంది. ఆ తర్వాత ఎపుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్తుంది. ఈలోపు నోటిఫికేషన్‌ ఇస్తే.. ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు ఉంటుందని, న్యాయపర చిక్కులు రావన్న అభిప్రాయంతో రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఉంది. అయితే, ఈ భర్తీకి ప్రభుత్వం నుంచి బోర్డుకు అధికారిక ఆదేశాలు రాలేదు.  

ఉపాధ్యాయ పోస్ట్ ల భర్తీ విషయంలో కూడా అధికారులు ముందు చూపుతో ఉన్నారు. తెలంగాణలోని పాఠశాలల్లో ఇప్పటికిప్పుడు ఉన్న ఖాళీల ప్రకారం 5వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం టీచర్ల పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే 12 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయొచ్చు. ఇదీ క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అనంతరం పాఠశాల విద్యా శాఖ తేల్చిన పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో విద్యా శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఏ నియామక ప్రక్రియ చేపట్టినా, ఎన్నికల కోడ్ అడ్డు రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు అధికారులు. అందుకే వడివడిగా అడుగులు వేస్తున్నారు. 


బిగ్ బాస్ 4 : అంతా ఒక్కటయ్యారు...వెయిటింగ్ ఫార్ విన్నర్...?

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?

భారత్ కి అమెరికా అండ..చైనాకి ఇత్తడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>