Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3d1a2bcb-a78e-4c27-aab9-b18d2ddd6148-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3d1a2bcb-a78e-4c27-aab9-b18d2ddd6148-415x250-IndiaHerald.jpgకరోనా లాక్‌డౌన్ దెబ్బకు థియేటర్లు మూసుకుపోవడంతో ప్రజలు వినోదానికి దూరమయ్యారు. అలాంటి వినోదాన్ని వారికి అందించేందుకు ఓటీటీలు రెడీ అయ్యాయి. ఈ ఓటీటీల్లో వచ్చే కథలకు కూడా అభిమానులు పెరుగుతుండడంతో పెద్ద సినిమాల..tollywood;karthik;rajiv menon;ram gopal varma;gautham new;gautham;nandini reddy;prasanth;prasanth varma;rajeev;sankalp reddy;sudha;suhasini;surya sivakumar;korea, south;tollywood;telugu;amazon;tamil;industry;sudha k prasad;reddy;lust stories;prashant kishor;amarnath k menon;net flixటాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?టాలీవుడ్‌ హీరోలకు ఓటీటీల్లో ఆ తరహా కథలు నచ్చడం లేదా..?tollywood;karthik;rajiv menon;ram gopal varma;gautham new;gautham;nandini reddy;prasanth;prasanth varma;rajeev;sankalp reddy;sudha;suhasini;surya sivakumar;korea, south;tollywood;telugu;amazon;tamil;industry;sudha k prasad;reddy;lust stories;prashant kishor;amarnath k menon;net flixSat, 19 Dec 2020 12:25:03 GMT
అంతేకాదు జాతీయ స్థాయిలో స్టార్ దర్శకులు కూడా ఇందులో సినిమాలు తీశారు. సూపర్ హిట్ కొట్టారు. దీనికోసం వారు ఎంచుకున్న విధానం.. ఆంథాలజీ. అంటే ఒకే సినిమాలో నాలుగు వేరువేరు కథలుంటాయి. ఆ నాలుగు కథలను నలుగురు వేరు వేరు దర్శకులు డైరెక్ట్ చేస్తారు. దీనివల్ల పని సులభమవుతుంది. కథతో కొత్త ప్రయోగాలు చేసేందుకూ వీలవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఆంథాలజీలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తున్నారు.

ఆంథాలజీ స్టోరీలు బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. మొదటిసారిగా తమిళంలో 5 కథలతో ''పుతం పుదు కలై'' అనే ఆంథాలజీ సిరీస్ రూపొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ ని ఐదుగురు డైరెక్టర్స్ తెరకెక్కించారు. అందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి స్టార్ డైరెక్టర్‌తో పాటు కార్తీక్ సుబ్బరాజు, రాజీవ్ మీనన్, సుధ కొంగర, సుహాసిని మణిరత్నం వంటి కొత్త డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి కూడా చక్కటి ఆదరణ లభించింది.

ఆదరణ పెరగడంతో పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలు కూడా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ తన తొలి తమిళ ఆంథాలజీ సిరీస్ 'పావకథైగల్'ని రూపొందించింది. ఈ ఆంథాలజీ సిరీస్‌ను నలుగురు స్టార్ డైరెక్టర్స్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ - వెట్రి మారన్ - సుధా కొంగర - విఘ్నేశ్ శివన్‌లు తెరకెక్కించారు. ఈరోజు రిలీజైన 'పావకథైగల్' మంచి స్పందన తెచ్చుకుంటోంది. అలానే మణిరత్నం ప్రొడక్షన్ లో తొమ్మిది మంది దర్శకులు కలిసి 'నవరస' అనే మరో ఆంథాలజీ సిరీస్‌ను తొలిసారిగా తొమ్మిది కథలతో రూపొందించబోతున్నారు. అంతేకాదు తమిళంలో సూర్య వంటి స్టార్ హీరోలు సైతం ఓటీటీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే తెలుగులో మాత్రం ఆంథాలజీలు చేయడానికి స్టార్ డైరెక్టర్స్ కానీ యంగ్ డైరెక్టర్స్ కానీ ఆసక్తి చూపడం లేదట. అంతేకాదు.. ఒకవేళ వారు ముందుకొచ్చినా.. మన స్టార్ హీరోలు వీటిలో నటించేందుకు ఒప్పుకోరనే టాక్ కూడా నడుస్తోంది. ఇప్పటికే హిందీలో రూపొందిన ‘లస్ట్ స్టోరీస్’ ఆంథాలజీని తెలుగులో నందిని రెడ్డి - సంకల్ప్ రెడ్డి - ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇది విడుదల ఎప్పుడవుతుందో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. దీంతో తెలుగులో ఓటీటీ ఫ్లాట్ ఫాంలు వస్తున్నా.. ఆంథాలజీలు ఎందుకు తీయరని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, హీరోలు ఎలా సమాధానం చెబుతారో చూడాలి.


వైసీపీ కార్యకర్తల చేతిలో తన్నులు తిని.. పోలీసులు ఇప్పుడు సిగ్గు లేకుండా.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు..?

రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్-4: విన్నర్ ఎవరో చెప్పేసిన బిగ్‌బాస్!?

పెళ్లయినా ఇంకా పిల్లలు లేని మన టాలీవుడ్ జంటలు..!!

తిరుపతి ఉప ఎన్నికల తర్వాత బిజెపికి పవన్ షాక్...?

ఆ సవాల్ స్వీకరిస్తే.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉన్నట్టే..

"జమిలి" ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>