PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp70c9dd76-141d-41ad-9b69-472a6bd230b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp70c9dd76-141d-41ad-9b69-472a6bd230b9-415x250-IndiaHerald.jpgగతంలో ఎప్పుడు లేని జోష్ బీజేపీ లో ఇప్పుడు కనిపిస్తుంది.. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఉత్తరాదిలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. సౌత్ లో కూడా కర్ణాటక లో అధికారంలో ఉంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా బలపడి అధికారంలోకి రావాలని చూస్తుంది.. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు కూడా గతంలోకంటే ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. అయితే తెలంగాణ లో బీజేపీ కి రెండో ప్రజాభిమానం ఉన్న పార్టీ గా చెప్పొచ్చు.. తెరాస పార్టీ కి ప్రజలు పట్టం కట్టినా మొన్నటిbjp;view;kcr;ktr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;andhra pradesh;karnataka - bengaluru;telangana;parliment;local language;josh;partyతెలంగాణ లో నాయకులను లాగేందుకు బీజేపీ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టిందా..?తెలంగాణ లో నాయకులను లాగేందుకు బీజేపీ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టిందా..?bjp;view;kcr;ktr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;andhra pradesh;karnataka - bengaluru;telangana;parliment;local language;josh;partySat, 19 Dec 2020 20:00:00 GMTజోష్ బీజేపీ లో ఇప్పుడు కనిపిస్తుంది.. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఉత్తరాదిలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. సౌత్ లో కూడా కర్ణాటక లో అధికారంలో ఉంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా బలపడి అధికారంలోకి రావాలని చూస్తుంది.. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు కూడా గతంలోకంటే ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. అయితే తెలంగాణ లో బీజేపీ కి రెండో ప్రజాభిమానం ఉన్న పార్టీ గా చెప్పొచ్చు.. తెరాస పార్టీ కి ప్రజలు పట్టం కట్టినా మొన్నటి దుబ్బాక ఎన్నిక లో బీజేపీ ని గెలిపించి కేసీఆర్ కి ఝలక్ ఇచ్చారు.

దాంతో హోరాహోరీగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. గెలుపు సంగతి పక్కనపెడితే వారి ప్రచారం తో తెరాస ను భయపెట్టె ప్రయత్నం మాత్రం మొదలుపెట్టారు.. మొదట పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు షాక్ ఇచ్చిన బీజేపీ, దుబ్బాక లో అల్లుడు హరీష్ రావు కి, గ్రేటర్ లో కొడుకు కేటీఆర్ కి షాక్ ఇచ్చి ఇప్పుడు పెద్ద తలకాయ మీద కేసీఆర్ మీద కన్నేశారు.. ఆ క్రమంలోనే రాష్ట్రంలో ఆకర్ష్ పేరుతో నాయకులను లాగే ప్రయత్నం మొదలుపెట్టారు.

గ్రేటర్ మేయర్ పీఠాన్ని  ఉన్న కార్పొరేటర్లతోనే గెలుచుకోవడం టీఆర్ఎస్ కు చిటికెలో పని. ఎంఐఎం గైర్హాజర్ అయితే చాలు. కానీ బీజేపీ.. తమ కార్పొరేట్లను టీఆర్ఎస్ ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. ఇది కూడా బీజేపీ వ్యూహమేనని అంచనా వేస్తున్నారు. ఈ కారణం చెప్పి.. టీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే ప్రణాళిక అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. బీజేపీ రాజకీయ వ్యూహాలను అంచనా వేసి.. నొప్పింపక తానొవ్వక రీతిలో ముందుకు సాగాల్సిన పరిస్థితిలో పడిపోయింది.. టీఆర్ఎస్ చూపిస్తున్న తప్పనిసరి మెదకదనం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారింది. ఏదేమైనా రివర్స్ ఎటాకింగ్ మోడ్ లో బీజేపీ తెరాస కి ఎలాంటి నష్టం తెస్తుందో చూడాలి.


శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>