MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/music-director-found-horizontallybf25e385-835a-4eba-b60a-71de31c8af39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/music-director-found-horizontallybf25e385-835a-4eba-b60a-71de31c8af39-415x250-IndiaHerald.jpgతమన్‌ మరోసారి దొరికిపోయాడు. 'క్రాక్‌' కోసం ఇచ్చిన 'భలేగా దొరికావే బంగారం' సాంగ్‌ ఓ లాటిన్‌ పాటకు కాపీ అంటూ.. ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. భలేగా దొరికిపోయావంటూ.. కామెంట్స్‌ పెడుతున్నాడు. ఇలా నెటిజన్లకు తమన్‌ దొరికిపోవడం కొత్తేమీ కాదు. అయితే.. ఈ బంగారం సాంగ్‌ మాత్రం.. మాస్‌రాజా ఫ్యాన్స్‌కే కాదు అందరికీ నచ్చేసింది. music director found horizontally;gopichand;ravi teja;thaman s;cinema;gold;hindi;director;v;ala vaikuntapuramloఅడ్డంగా దొరికిపోయిన మ్యూజిక్ డైరెక్టర్..!అడ్డంగా దొరికిపోయిన మ్యూజిక్ డైరెక్టర్..!music director found horizontally;gopichand;ravi teja;thaman s;cinema;gold;hindi;director;v;ala vaikuntapuramloSat, 19 Dec 2020 22:30:00 GMT
తమన్‌పై కాపీ ఆరోపణలు మొదటి నుంచీ వస్తూనే ఉన్నాయి. రవితేజ, శృతిహాసన్‌ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్‌కు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆల్ రెడీ ఐటం సాంగ్‌ రిలీజ్‌ కాగా.. కాంట్రవర్సీ కాలేదు. రీసెంట్‌గా విడుదలైన 'భలేగా దొరికావే బంగారం'  సాంగ్‌ 'సెల్వా ఎల్‌ నియాన్‌' అనే ఒరిజినల్‌ ట్యూన్ నుంచి ఎత్తేశాడంటూ ట్రోల్‌ చేస్తున్నారు. పల్లవి.. చరణానికి మధ్యలో చిన్న ట్యూన్‌ 'సెల్వా ఎల్‌ నియాన్‌'ను గుర్తుచేసింది.  ఇదొక్కటి లేకపోతే.. కాపీ సమస్యే వచ్చేది కాదు.

క్రాక్‌లో ముందుగా రిలీజైన ఐటం సాంగ్‌ కంటే.. భలేగా దొరికావే బంగారంకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంతలో  కాపీ అంటూ.. ట్రోల్‌ మొదలైంది. కింగ్‌ మూవీలో బ్రహ్మానందం ఫేస్‌కు తమన్‌ ఫేస్‌ పెట్టి భలేగా దొరికిపోయావంటూ.. మీమ్స్‌తో షేర్‌ చేశారు. అలాగే తమనే బలుపు కోసం ట్యూన్‌ చేసిన కాజలు చెల్లివా సాంగ్‌లో స్టార్టింగ్‌ ట్యూన్‌ హిందీ మూవీ అప్నా సప్నా మనీ మనీ'లోని 'దిల్‌ మే బజీ..' సాంగ్‌ను గుర్తుచేసింది.

కాపీ అనే విమర్శ తమన్‌పై కామన్‌ అయిపోయింది. వి సినిమాకు తమన్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రమే ఇవ్వగా.. దానిపైన కూడా కాపీ ముద్ర పడింది. జిబ్రాన్ మ్యూజిక్‌ ఇచ్చిన 'రాక్షసుడు'లోని ట్యూన్‌లా ఉందంటూ అప్పట్లో పెద్ద దుమారే రేగితే...  దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఖండించాడు. తమన్‌పై కాపీ ముద్ర పడినా.. అల వైకుంఠపురంలో వంటి మ్యూజికల్‌ హిట్స్‌తో అన్నీ మరిచిపోయేలా చేసి.. తన స్థాయిని పెంచుకున్నాడు. మళ్లీ అలాంటి ఆల్బమ్‌ పడితే.. కాపీ ఆరోపణలు పట్టించుకోరంటున్నారు  చిత్ర వర్గాలు.





టీమ్‌ఇండియాకు మరో షాక్‌

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>