PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-worth-corona-virus-blow0ea83ba6-4418-4e35-bab7-b27c25ac8381-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-worth-corona-virus-blow0ea83ba6-4418-4e35-bab7-b27c25ac8381-415x250-IndiaHerald.jpgకరోనా ట్వంటీ ట్వంటీలో చెలరేగిపోయింది. అందరినీ ఓ ఆట ఆడేసుకుంది. దేశంలో తొమ్మిది నెలలుగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతునే ఉన్నాయి. ఈ సంఖ్య కోటికి చేరువయ్యింది. నిన్నటికి 99లక్షల 79వేలకు చేరిన ఈ సంఖ్య మరో ఒకటి రెండు రోజుల్లో కోటికి చేరనుంది. people worth corona virus blow;koti;nithya new;saudi arabia;january;central government;march;manadesamకరోనా దెబ్బకు జనం విలవిల..!కరోనా దెబ్బకు జనం విలవిల..!people worth corona virus blow;koti;nithya new;saudi arabia;january;central government;march;manadesamSat, 19 Dec 2020 22:15:00 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7కోట్ల 50లక్షలు దాటింటి. అమెరికాలో అత్యధికంగా కోటి 72లక్షల మందికి వైరస్‌ సోకగా 3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రెండో దేశంగా భారత్‌ ఉంది. ప్రస్తుతం మనదేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య కోటికి చేరింది. దేశంలో కరోనా బారిన పడ్డ వారిలో 95లక్షల మంది కోలుకున్నారు. లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. మార్చిలో లాక్‌డౌన్‌ విధించేనాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య 600లకు చేరుకుంది. అప్పటికే 13 మంది చనిపోయారు. మొదటి కరోనా మరణం మార్చి 12న కర్ణాటకలో రికార్డయ్యింది. సౌదీ అరేబియా వెళ్లివచ్చిన కాలబుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరిణించాడు. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన నాటినుంచి భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైన రికార్డులూ ఉన్నాయి.  సెప్టెంబర్‌ లో 26లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్‌లోనూ వైరస్‌ తీవ్రత కొనసాగింది. నవంబర్‌ నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది కేంద్రం. వీటిలో రోజూ దాదాపు 10లక్షలకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 15కోట్ల 89లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. భారత్‌లో త్వరలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవువుతోంది కేంద్రం. దేశంలో మొత్తం ఆరు వ్యాక్సిన్స్ ట్రయల్ దశలో ఉన్నాయి. కరోనా వైరస్‌ బయటపడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఆ వైరస్‌ మూలాలపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది.





మసాజ్ చేయించుకున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా: నారా లోకేష్

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>