MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-mahesh-babu48374b7f-3523-40a4-a1cb-6e17bcd6ac65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-mahesh-babu48374b7f-3523-40a4-a1cb-6e17bcd6ac65-415x250-IndiaHerald.jpg బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్నేళ్ళ క్రితం నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి తొలిసారిగా రాజు తీసిన దిల్ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని తద్వారా ఆయనకి దిల్ రాజు అనే పేరును తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి అందరూ కూడా ఆయన్ని దిల్ రాజు అని పిలుస్తూ వచ్చారు. ఆపై వరుసగా ఎన్నో సినిమాలను నిర్మిస్తూ తద్వారా భారీ విజయాలు సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్లిన రాజు ఇటీవల కూడా వరుసగా పలు సక్సెస్ఫుల్ సినిమాలుprabhas;mahesh babu;mahesh;prabhas;ram charan teja;naga chaitanya;krishnam raju;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;varsha;vijay;vijay deverakonda;hyderabad;tollywood;cinema;rajani kanth;media;producer;audio;producer1;joseph vijay;nithin reddy;sri venkateshwara creations;dil;devarakondaవార్ని .... ఇద్దరికీ పేరుకి వయసు పెరిగింది అంతే .... వర్చస్సు ఏమాత్రం తగ్గలేదబ్బా .....??వార్ని .... ఇద్దరికీ పేరుకి వయసు పెరిగింది అంతే .... వర్చస్సు ఏమాత్రం తగ్గలేదబ్బా .....??prabhas;mahesh babu;mahesh;prabhas;ram charan teja;naga chaitanya;krishnam raju;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;varsha;vijay;vijay deverakonda;hyderabad;tollywood;cinema;rajani kanth;media;producer;audio;producer1;joseph vijay;nithin reddy;sri venkateshwara creations;dil;devarakondaSat, 19 Dec 2020 07:00:00 GMTటాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కొన్నేళ్ళ క్రితం నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి తొలిసారిగా రాజు తీసిన దిల్ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని తద్వారా ఆయనకి దిల్ రాజు అనే పేరును తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి అందరూ కూడా ఆయన్ని దిల్ రాజు అని పిలుస్తూ వచ్చారు. ఆపై వరుసగా ఎన్నో సినిమాలను నిర్మిస్తూ తద్వారా భారీ విజయాలు సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్లిన రాజు ఇటీవల కూడా వరుసగా పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు.
ఇక టాలీవుడ్ లోని చాలా మంది అగ్ర నటులతో సినిమాలు నిర్మించిన రాజు నిన్న తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇటీవల రెండో వివాహం అనంతరం రాజు  జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావటంతో ఆయన టాలీవుడ్లోని సినిమా ప్రముఖులు అందర్నీ కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన ఈ వేడుకకు టాప్ సెలబ్రిటీలు హీరోలు, హీరోయిన్లు అందరూ వచ్చి ఎంతో సందడి చేశారు. కాగా నిన్న ఉదయం నుండి వారందరి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ వేడుకలో భాగంగా సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగచైతన్య, విజయ్ దేవరకొండ, రామ్ తదితరులు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతుంది. ఇక ఆ ఫోటోలో మహేష్ బాబు, ప్రభాస్ లను చూసిన వారి వారి అభిమానులు ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం వర్షం సినిమా ఆడియో రిలీజ్ సమయంలో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోని పోలుస్తూ ఈ ఇద్దరికీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పేరుకి వయసు పెరిగింది అంతే తప్ప ముఖవర్చస్సు లో ఏ మాత్రం మార్పు రాలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఎంతో అందంగా ఉన్నారని వారిపై పొగడ్తలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుండగా మహేష్ బాబు అతి త్వరలో సర్కారు వారి పాట సినిమా షూటింగులో జాయిన్ కానున్న విషయం తెలిసిందే.....!!


స్పొర్ట్స్ : నేనెప్పుడు వాళ్ళని ఫాలో అవ్వను..అశ్విన్ !!

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>