PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjpa7d4559b-6ca7-40fc-8e56-4cad5f0523b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjpa7d4559b-6ca7-40fc-8e56-4cad5f0523b2-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల ఉప ఉపఎన్నికలపై ఇప్పటినుంచే కమలం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఇటు తెలంగాణాలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, అటు ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నిక జరగనున్నాయని ప్రాధమిక సమాచారం. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించి అధికార తెరాస కి ముచ్చెమటలు పట్టించి బలోపేతమైన బీజేపీ నాగార్జున సాగర్ లోనూ అదే దూకుడు ప్రదర్శించాలని భావిస్తోంది.bjp;view;allu aravind;nagarjuna akkineni;lakshmi;raghu;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;amaravati;andhra pradesh;telangana;tirupati;kanna lakshminarayana;husband;lakshmi devi;letter;march;partyతెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలపై కమలం కసరత్తుతెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలపై కమలం కసరత్తుbjp;view;allu aravind;nagarjuna akkineni;lakshmi;raghu;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;amaravati;andhra pradesh;telangana;tirupati;kanna lakshminarayana;husband;lakshmi devi;letter;march;partySat, 19 Dec 2020 15:11:00 GMTతెలుగు రాష్ట్రాల ఉప ఉపఎన్నికలపై ఇప్పటినుంచే కమలం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఇటు తెలంగాణాలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, అటు ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నిక జరగనున్నాయని ప్రాధమిక సమాచారం. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించి అధికార తెరాస కి ముచ్చెమటలు పట్టించి బలోపేతమైన బీజేపీ నాగార్జున సాగర్ లోనూ అదే దూకుడు ప్రదర్శించాలని భావిస్తోంది.

ఇందుకోసం బండి సంజయ్, అరవింద్, రఘునందన రావు తదితర నేతలంత వ్యూహ ప్రతివ్యూహాలు రచనలో నిమగ్నమయ్యారు. అంతకు ముందే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. రఘునందన్ రావు నాగార్జున సాగర్ లోని నేతలని కలసి ఎలా ముందుకు వెళ్లాలో సమాలోచనలు చేస్తున్నారు. ఎలాగైనా నాగార్జున సాగర్ ను తమ విజయాల ఖాతాలో వేసుకోవాలని తీవ్ర తపన పడుతున్నారు. 


ఇక, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా సత్తా చూపించాలని తెగ ఉబలాటపడుతున్నారు. నిజానికి, తెలంగాణలో బీజేపీ బాగా బలోపేతమైంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో నోటా కన్నా తక్కువ ఓట్లతో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. కారణం...ఆ రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరేనంటున్నారు పరిశీలకులు. కొన్ని కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోకపోడంతో పాటు అధికార వైస్సార్ పార్టీ పట్ల మెతక ధోరణి అవలంబిస్తూ నానాటికీ ఉనికిని కోల్పోతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రజా ఆంక్షల మేర నడుచుకునే విషయంలో వెనుకబడి ఉండనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. 


'ముందు కన్నా లక్ష్మీ నారాయణ, ప్రస్తుతం సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవుల్లో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా ఏడాదిగా సాగుతున్న అమరావతి ఉద్యమం విషయంలో సానుకూలంగా మాట్లాడిన అధికార ప్రతినిధుల్ని సోము వీర్రాజు సస్పెండ్ చేయడం, ఒకే రాజధానికి సంబంధించి ప్రకటనల్లో అయోమయం చోట చేసుకుంటుండడంతో పాటు...నిన్నటికి నిన్న ఏడాది పూర్తయిన అమరావతి ఉద్యమ నేపథ్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని అమరావతికి మద్దతు తెలపడం...ఇలా అనేకానేక అయోమయాలతో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నడుస్తోంది. 


తాజాగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఉత్స్తహా పడుతున్న నేపథ్యంలో...ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రయిక్ లు జరపాలంటూ ప్రకటించడం విశేషం. తెలంగాణాలో ఇదే ప్రకటన బండి సంజయ్ చేయడం గమనార్హం. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తిరుపతి ఎన్నికల్లో గెలుస్తుందా? దుబ్బాక ఉప ఎన్నిక విజయాన్ని తెలంగాణాలో పునరావృతం చేస్తుందా వేచి చూడాల్సిందే.



కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా

రీమేక్ లకి టెంప్ట్ అవని తెలుగు హీరోలు వీరే

భారత్ లోకి చైనా అలాగే వస్తుందా...?

ఆన్ లైన్ లోన్ యాప్ సృష్టి కర్తను అరెస్ట్ చేసిన పోలీసులు.. చివరికి

‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ అదిరింది.. ఇది కూడా హిట్టే!?

‘మా అన్న బంగారుకొండ’.. అన్నపై ముద్దులు కురిపించిన నిహారిక!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>