PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt9837d242-db95-4d6f-9604-73ef17e3c2e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt9837d242-db95-4d6f-9604-73ef17e3c2e4-415x250-IndiaHerald.jpgకొత్త ఏడాది వస్తూనే అగ్ని పరీక్షను వైసీపీ సర్కార్ కి రెడీ చేసి పెట్టింది. దాన్ని ఎదుర్కొంటేనే వైసీపీ సర్కార్ ముందుకు సాగగలదు. మరింత దూకుడుగా పాలన సాగించగలదు. కొత్త ఏడాది పండుగలతో జనవరి నెల ముగియగానే ఫిబ్రవరి వస్తుంది. ఆ నెలలోనే తిరుపతి ఎన్నికల నగారా మోగనుంది. అంటే ఇదే నెల జగన్ సర్కార్ మీద జనాభిప్రాయాన్ని తెలియచేస్తుంది అన్న మాట. tpt;suresh;prasad;tiru;bharatiya janata party;korcha;jagan;kiliveti sanjeevaiah;january;tirupati;assembly;mla;february;husband;tdp;ycp;venkatagiri;gudur;petta;dookuduతిరుపతి లోక్ సభ : మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ ఎదురీత...?తిరుపతి లోక్ సభ : మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ ఎదురీత...?tpt;suresh;prasad;tiru;bharatiya janata party;korcha;jagan;kiliveti sanjeevaiah;january;tirupati;assembly;mla;february;husband;tdp;ycp;venkatagiri;gudur;petta;dookuduSat, 19 Dec 2020 22:00:00 GMTవైసీపీ సర్కార్ కి రెడీ చేసి పెట్టింది. దాన్ని ఎదుర్కొంటేనే వైసీపీ సర్కార్ ముందుకు సాగగలదు. మరింత దూకుడుగా పాలన సాగించగలదు. కొత్త ఏడాది పండుగలతో జనవరి నెల ముగియగానే ఫిబ్రవరి వస్తుంది. ఆ నెలలోనే తిరుపతి ఎన్నికల నగారా మోగనుంది. అంటే ఇదే నెల జగన్ సర్కార్ మీద జనాభిప్రాయాన్ని తెలియచేస్తుంది అన్న మాట.

తిరుపతి ఎన్నికల్లో కష్టపడి గెలవడానికి విపక్షం కాచుకుని కూర్చుంది.  బీజేపీ తొడగొడుతూంటే టీడీపీ అందరి కంటే ముందే అభ్యర్ధిని పెట్టి సమరానికి సై అంటోంది. ఈ నేపధ్యంలో అసలు తిరుపతిలో అధికార వైసీపీకి ఉన్న సీన్ ఏంటి, ఈసారి ఎంతదాకా కధ సాగుతుంది అన్నది కనుక గ్రౌండ్ లెవెల్ వరకూ వెళ్ళి చూస్తే చాలా విషయాలే కనిపిస్తున్నాయి.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఖాయం. ఇది అందరూ చెబుతున్న మాటే. కానీ మెజారిటీ మాత్రం గతసారి వచ్చినది నిలుపుకుంటుందా లేదా అన్నదే పెద్ద ప్రశ్న‌గా ఉంది. గతసారి ఎన్నికల్లో తిరుపతిలో బల్లి దుర్గా ప్రసాద్ కి రెండు లక్షల 28వేల పై చిలుకు మెజారిటీ వచ్చింది. ఏపీలో లోక్ సభ సీట్లలో చూసుకుంటే అతి పెద్ద నాలుగవ మెజారిటీగా నాడు నమోదు అయింది.

ఇపుడు తిరుపతిలో అంత మెజారిటీ కనుక వైసీపీకి వస్తే కచ్చితంగా జగన్ ముందుకు దూసుకుపోతారు. ఆయన పాలన మీద జనం పూర్తి సంతృప్తిగా ఉన్న్నట్లుగా లెక్క వేసుకోవాలి. అయితే తిరుపతి లోక్ సభ పరిధిలో ఉన్న  తిరుపతిలో మెజారిటీ ఖాయమని అంటున్నారు. అలాగే శ్రీకాళహ‌స్తిలో కూడా వైసీపీకి మంచి మెజారిటీ వస్తుంది.ఇక వెంకటగిరి, సర్వేపల్లిలలో  మెజారిటీ గ్యారంటీ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడంతా గట్టి నేతలు వైసీపీకి ఉన్నారు.

మరి డల్ గా అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే సుళ్ళూరు పేట, సత్యవేడు, గూడూరులలో మాత్రం వైసీపీకి కొంత ఇబ్బంది ఎదురవుతుంది అంటున్నారు. మంత్రిగా ఉండడం చేత సత్యవేడు మీద ఆదిమూలం సురేష్ పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు అంటున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే గూడూరులో ఎమ్మెల్యే గా ఉన్న వరప్రసాద్ మీద వ్యతిరేకత ఉంది. సుళ్ళూరు పేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా ధాటీగా రాజకీయం చేయడంలేదు అంటున్నారు. అందుకే ఈ మూడు సెగ్మెంట్ల మీదనే వైసీపీ చూపు సారించింది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.




కన్న తల్లి చివరి కోరిక మేరకు కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసిన కుమార్తెలు!

పవర్ స్టార్‌కు షాకిచ్చిన దగ్గుబాటి రానా.. కారణమిదేనట!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>