PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpadfe0538-74e7-4381-933f-ea1e62c11da5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpadfe0538-74e7-4381-933f-ea1e62c11da5-415x250-IndiaHerald.jpgకంటోన్మెంట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జంపన ప్రతాప్‌, మలక్‌పేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సతీష్‌ తో పాటు పలువురు నాయకులు బీజేపీ జాతీయ నేత, పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారుbjp;thirtha;hyderabad;bharatiya janata party;telangana;congress;muralidhar rao;mp;tpcc;mla;malakpet;party;mantraబీజేపీలోకి వరదలా చేరికలుబీజేపీలోకి వరదలా చేరికలుbjp;thirtha;hyderabad;bharatiya janata party;telangana;congress;muralidhar rao;mp;tpcc;mla;malakpet;party;mantraSat, 19 Dec 2020 09:05:28 GMT తెలంగాణ బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. దుబ్బాక విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కంటోన్మెంట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జంపన ప్రతాప్‌, మలక్‌పేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సతీష్‌ తో పాటు  పలువురు నాయకులు బీజేపీ జాతీయ నేత, పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మురళీధర్ రావు..ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు వరదలా సాగుతున్నాయని  అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు సాలార్‌జంగ్‌ మ్యూజియం వైపు పరుగెడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

        రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలంతా కమలం తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్రెడ్డికి టీపీసీసీ ఇస్తే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డితో పాటు పలువురు నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వెంకట్రెడ్డికి టీపీసీసీ అవకాశం వస్తే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా కాషాయం కండువా కప్పుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు అనుగుణంగా  బీజేపీ నేతలు కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు.  వెంకట్రెడ్డి‌కి పీసీసీ వస్తే  రేవంత్రెడ్డితో సహా చాలా మంది సీనియర్లకు వల వేయాలాని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


 ఇప్పటికే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు చాలా మంది కాషాయ పార్టీలో చేరిపోయారు. శాసన మండలి మాజీ చైర్మన్స్వామిగౌడ్ బీజేపీలో చేరడంతో ఇంకా కొంతమంది టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మాజీ మంత్రులు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

 




చట్టసభల్లోని నేరచరితుల ఓటు చెల్లుబాటుపై సుప్రీం కోర్ట్ సంచలన వ్యాఖ్యలు !

రెచ్చిపోయిన ఎంఐఎం నేత.. తుపాకీతో బహిరంగంగా...

విరుష్కకు ఆసక్తికరమైన ఆఫరిచ్చిన ఆసిస్ దిగ్గజ పేసర్

బెంగాల్‌ బీజేపీ సీఎం అభ్యర్థి మరో యోగి.. సోషల్ మీడియాలో ప్రచారం!

టాప్ ప్రొడ్యూసర్‌తో సుకుమార్ గొడవ.. అందుకే ఆ సినిమాలో హీరో మారాడట!

‘ఆర్‌ఆర్‌ఆర్’ మరో రికార్డ్!

లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>