MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tamil-hero-vijay-satta-in-teluguabea6058-572a-4a7b-b34d-89496627d998-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tamil-hero-vijay-satta-in-teluguabea6058-572a-4a7b-b34d-89496627d998-415x250-IndiaHerald.jpgతమిళ హీరో విజయ్‌ మొదట్లో దురదృష్టాన్ని వెంటేసుకుని తిరిగాడు. ఎంత దూరంగా ఉండాలనునకుంటే.. అంత దగ్గరగా వాటేసుకుంది. ప్రస్తుతం అదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. మొదట్లో విజయ్‌ను హీరోగానే లెక్కచేయని టాలీవుడ్ ప్రస్తుతం స్వాగతం పలుకుతోంది. అదేమిటో.. తెలుగులో సరైన సినిమా ఒక్కటీ రానప్పుడు వచ్చి హిట్స్ కొట్టేస్తున్నాడు ఈ తమిళ తంబీ. tamil hero vijay satta in telugu;kranthi;kranti;tiru;vijay;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;tamil;remake;husband;hero;success;joseph vijay;tambi;master;adirindiతెలుగులో తమిళ హీరో సత్తా..!తెలుగులో తమిళ హీరో సత్తా..!tamil hero vijay satta in telugu;kranthi;kranti;tiru;vijay;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;tamil;remake;husband;hero;success;joseph vijay;tambi;master;adirindiSat, 19 Dec 2020 22:00:00 GMTతమిళ హీరో విజయ్‌ మొదట్లో దురదృష్టాన్ని వెంటేసుకుని తిరిగాడు. ఎంత దూరంగా ఉండాలనునకుంటే.. అంత దగ్గరగా వాటేసుకుంది. ప్రస్తుతం అదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. మొదట్లో విజయ్‌ను హీరోగానే లెక్కచేయని టాలీవుడ్ ప్రస్తుతం స్వాగతం పలుకుతోంది. అదేమిటో.. తెలుగులో సరైన సినిమా ఒక్కటీ రానప్పుడు వచ్చి హిట్స్ కొట్టేస్తున్నాడు ఈ తమిళ తంబీ.

ఓ దశాబ్దకాలం గడిస్తేగానీ.. విజయ్‌కు తెలుగులో సక్సెస్‌ దక్కలేదు. తమిళంలో హిట్టయిన ప్రతి సినిమా ఇక్కడొచ్చేసరికి ఫ్లాప్ అయ్యేది. తెలుగువాళ్లకు విజయ్‌ నచ్చడని డబ్‌ చేయడం కూడా మానేశారు. ఎట్టకేలకు మెర్సల్‌ తెలుగు రీమేక్ అదిరిందితో తెలుగులో తొలి సక్సెస్‌ అందుకున్నాడు విజయ్‌.

ధనుష్‌.. విజయ్‌సేతుపతి కంటే లేటుగా తెలుగులో  హిట్ కొట్టిన విజయ్‌కు సమయం కలిసొచ్చింది. ఎలాగంటే.. కాంపిటీషన్‌ లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను దోచేశాడు. ఈ అరవ హీరో సినిమాలు అదిరింది.. విజిల్‌ దీపావళికి వచ్చాయి. తెలుగులో దీపావళికి పెద్ద సందడి ఉండదు. ఈ సమయంలో.. సోలోగా వచ్చి రెండు హిట్స్‌ కొట్టాడు విజయ్‌. 3కోట్ల బిజినెస్‌ జరుపుకున్న అదిరింది 5 కోట్లకు కలెక్ట్‌ చేస్తే..  7 కోట్లకు అమ్ముడైన విజిల్‌ 10 కోట్లు వసూలు చేసింది. ఇలా.. తెలుగులో మార్కెట్‌ పెంచుకుంటున్నాడు విజయ్‌.

అదృష్టం మరోసారి తలుపు తట్టడంతో.. విజయ్‌ మరోసారి సోలోగా వస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కావాల్సిన 'మాస్టర్' న 2021 సంక్రాంతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పెద్దపండక్కి వద్దామనుకున్న వకీల్‌సాబ్‌.. నితిన్‌ రంగ్‌దే వెనక్కి తగ్గాయి. ఉంటే గింటే... రామ్‌ నటించి రెడ్‌ ఒక్కటే సంక్రాంతి రేసులో ఉంటుంది. ఇప్పటికే రిలీజైన మాస్టర్‌ తెలుగు టీజర్‌ ఆకట్టుకుంది. మరోసారి ఎవరూ రాని ముహూర్తం చూసుకొని.. బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేయాలని చూస్తున్నాడు మాస్టర్‌.మొత్తానికి విజయ్ సోలోగా వచ్చి హిట్స్ కొట్టాడు. లేటుగా తెలుగులో సక్సెస్ చూసిన విజయ్ అదిరిందితో తొలి హిట్ సాధించేశాడు.








కన్న తల్లి చివరి కోరిక మేరకు కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసిన కుమార్తెలు!

శభాష్ డీఆర్‌డీవో..ఇక మనమే నెంబర్ వన్!

డిసెంబర్ 29న వారి ఖాతాల్లోకి నేరుగా రూ. వెయ్యి కోట్లు జమా!

రీ ఎంట్రీ తరువాత పవన్ లో ఫుల్ చేంజ్.. షాక్ తింటున్న మేకర్స్ ?

జగన్ ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు.. ఇంకా అంటే..?

చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

గ్రేటర్ లో తెరాస ఓటమికి కొన్ని కారణాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>