PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/deputy-speaker-narendra-varmafdde5ef9-7daa-4a63-8e9b-b918caf69672-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/deputy-speaker-narendra-varmafdde5ef9-7daa-4a63-8e9b-b918caf69672-415x250-IndiaHerald.jpgఏ పండగ వ‌చ్చినా.. పేద‌ల ఇళ్ల‌లో ఎలాంటి శుభ‌కార్యాలు జ‌రుగుతున్నా.. స్వ‌యంగా తెలుసుకుని వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. కులాలు, మ‌తాలు, వ‌ర్గాల‌కు అతీతంగా ఆయ‌న చేస్తోన్న సేవా, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు బాప‌ట్ల ప్ర‌జ‌ల్లోనే కాకుండా గుంటూరు జిల్లాలో ఆయ‌న పేరు మార్మోగేలా చేశాయి. దీంతో టీడీపీ ఇక్క‌డ జోరు పెంచుకుని ప‌రుగులు పెడుతోంది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. రెండు ద‌ఫాల ఎన్నిక‌ల్లో కోన ర‌ఘుప‌తి విజ‌యం సాధించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే.. దీనికి కార‌ణం ఉంది. బ‌ల‌deputy speaker narendra varma;nithya new;tiru;2019;aqua;letter;tdp;ycp;dookuduడిప్యూటీ స్పీక‌ర్‌కు చెమ‌ట‌లు పడుతున్నాయా... బాప‌ట్ల రాజ‌కీయం మార్చిన వ‌ర్మ‌..!డిప్యూటీ స్పీక‌ర్‌కు చెమ‌ట‌లు పడుతున్నాయా... బాప‌ట్ల రాజ‌కీయం మార్చిన వ‌ర్మ‌..!deputy speaker narendra varma;nithya new;tiru;2019;aqua;letter;tdp;ycp;dookuduSat, 19 Dec 2020 16:49:46 GMTగుంటూరు జిల్లాలోని బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు మారుతున్నాయి. ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ దూకుడుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే.. అక్క‌డ తాను ఉంటాను అని ఆయ‌న చెబుతున్న‌ట్టుగానే నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. ఆర్థికంగా కూడా త‌న సొంత స్వ‌చ్ఛంద సంస్థ‌ల నుంచి వ‌చ్చే ఆదాయంతో ఇక్క‌డ అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి 2017 నుంచే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని మ‌రీ తిరుగుతున్నారు. నీటి ఎద్ద‌డి ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో స్వ‌యంగా త‌న సొంత డ‌బ్బు వెచ్చించి.. ట్యాంకులు త‌ర‌లించి.. పేద‌ల గొంతు త‌డుపుతున్నారు.

ఏ పండగ వ‌చ్చినా.. పేద‌ల ఇళ్ల‌లో ఎలాంటి శుభ‌కార్యాలు జ‌రుగుతున్నా.. స్వ‌యంగా తెలుసుకుని వారికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. కులాలు, మ‌తాలు, వ‌ర్గాల‌కు అతీతంగా ఆయ‌న చేస్తోన్న సేవా, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు బాప‌ట్ల ప్ర‌జ‌ల్లోనే కాకుండా గుంటూరు జిల్లాలో ఆయ‌న పేరు మార్మోగేలా చేశాయి. దీంతో టీడీపీ ఇక్క‌డ జోరు పెంచుకుని ప‌రుగులు పెడుతోంది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. రెండు ద‌ఫాల ఎన్నిక‌ల్లో కోన ర‌ఘుప‌తి విజ‌యం సాధించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే.. దీనికి కార‌ణం ఉంది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేక పోవ‌డం.. ప్ర‌జ‌ల్లో గుర్తింపు లేని నాయ‌కుడు, ప్ర‌జ‌ల్లో క‌లివిడిగా తిరిగే ఓపిక‌లేని నాయ‌కుడిగా పేరున్న అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇది కోన‌కు అవ‌కాశంగా మారింది. దీంతో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు.

పైగా స‌తీష్ గ‌త ఎన్నిక‌ల్లో రెండోసారి ఓడిపోయాక ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఇక్క‌డ టీడీపీని నిల‌బెట్ట లేక బీజేపీలోకి జంప్ చేసేశారు. ఇక రెండు సార్లు గెలిచిన ర‌ఘుప‌తికి జ‌గ‌న్ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే.. రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. పైగా ప్ర‌జ‌ల మైండ్ సెట్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. సో.. ఇప్పుడు కోన‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. డిప్యూటీ స్పీక‌ర్ కావ‌డంతో ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి రాలేక పోతున్నారు. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచినా ఆయ‌న బాప‌ట్ల అభివృద్ధిలో త‌న ముద్ర వేయ‌లేక‌పోతున్నారు.

ఇక వైసీపీకి ఎప్పుడూ కొమ్ము కాసే కొన్ని సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌లు, నేత‌లు కూడా ఇప్పుడు ర‌ఘుప‌తికి యాంటీ అవుతోన్న ప‌రిస్థితి ఉండ‌డంతో ఆయ‌న గ్రిప్ కోసం కిందా మీదా ప‌డుతున్నారు. మ‌రోవైపు టీడీపీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా వేగేశ్న ఇన్‌చార్జ్ ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే దూకుడుగా ముందుకు సాగుతున్నారు. గ‌త రెండు ద‌శాబ్దాలుగా బాప‌ట్ల‌లో రాజ‌కీయాలు చేస్తోన్న కోన ర‌ఘుప‌తికి ఇప్పుడు ఉన్నంత టెన్ష‌న్ గ‌తంలో ఎప్పుడూ లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి తోడు.. రాజ‌ధాని ర‌గ‌డ మ‌రింత‌గా ఆయ‌న‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోనకు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 


పవన్ క్రేజ్ చూసి బాలీవుడ్ నటులే షాక్!

ఇచ్చిన మాట కోసం భారీగా నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్...!

చైనా లోన్ యాప్‌లతో జాగ్రత్త!

జగన్ కు టీడీపీ సీనియర్ లేఖ...!

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా...కేంద్రం ఏమి చెబుతోంది...?

కేక పుట్టిస్తున్న నయనతార స్టిల్స్ ..దానికోసమేనా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>