CrimeSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/suicide25d72635-125c-4ce1-968e-c63ec336fed4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/suicide25d72635-125c-4ce1-968e-c63ec336fed4-415x250-IndiaHerald.jpgనారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల సమీపంలో కూల్ డ్రింక్‌లో విషం కలుపుకొని తాగి జంట అత్మహ్యత్యకు పాల్పడింది. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో జంట అత్మహ్యత్య చేసుకుంది. suicide;mano;prema;sekhar;district;smart phone;huzur nagar;police;december;love;bike;local language;aaviriకూల్ డ్రింక్‌లో విషం కలుపుకొని ప్రేమజంట అత్మహ్యత్యకూల్ డ్రింక్‌లో విషం కలుపుకొని ప్రేమజంట అత్మహ్యత్యsuicide;mano;prema;sekhar;district;smart phone;huzur nagar;police;december;love;bike;local language;aaviriFri, 18 Dec 2020 20:14:00 GMTప్రేమ,  ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో అత్మహ్యత్య... ఇలాంటి ఘటనలు నేటి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ప్రేమ మోజులో పడుతున్న యువత... తల్లిదండ్రులు తమ భవిష్యత్తుపై పెట్టుకున్న ఎన్నో ఆశలను ఆవిరి చేయడమే కాకుండా, వారికి శాశ్వతంగా దూరమై తీవ్ర మనో వేదనను మిగులుస్తున్నారు. తాజాగా ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మహబూబ్‌ నగర్ జిల్లాలో ఓ ప్రేమ జంట అత్మహ్యత్య చేసుకుంది. చిన్న చింతకుంట మండలం ఉంద్యాల సమీపంలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇక వివరాలు చూస్తే...  నారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన 23 ఏళ్ళ యువకుడు శేఖర్, అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇద్దరు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. బాలిక మైనర్‌ కావడంతో పాటు ఇద్దరి కులాలు వేరు వేరు కావడంతో వారి ప్రేమకు  తల్లిదండ్రులు నో చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జంట ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇక అనుకున్నదే తడవుగా మంగళవారం (డిసెంబర్ 15) రోజున బైక్ పై ఇంటి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత శుక్రవారం ఉంద్యాలలో వీరి మృతదేహాలు కనిపించాయి. పొలాలకు వెళ్తున్న స్థానికులు వీరు విగత జీవులుగా కనిపించి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు, ఇరు కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ప్రేమ పేరుతో మోసపోయామని, ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని యువతీ యువకులు ఆత్మహత్య చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రేమలో పడి బంగారం భవిష్యత్తు పాడు చేసుకోవద్దని, అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దని కోరుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ దగ్గరైనప్పటి నుండి, యువత ప్రతి చిన్న విషయానికి మనస్తాపానికి గురై అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.




వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?

ప్రధాని భాగోతం ఇదా ? గుట్టు బయటపెట్టిన రాధా చరణ్ దాస్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>