MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cine-parisramaku-ap-sarkar-subhavarta99b94494-232c-4949-87b5-fda3b33f3364-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cine-parisramaku-ap-sarkar-subhavarta99b94494-232c-4949-87b5-fda3b33f3364-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.అందులో సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమకు చేయూతనిచ్చేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి. దాని ప్రకారం 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేశారు. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేశారు. దాని వలన నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరtollywood;education;tiru;jagan;andhra pradesh;cabinet;survey;collegeసినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్తసినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్తtollywood;education;tiru;jagan;andhra pradesh;cabinet;survey;collegeFri, 18 Dec 2020 18:00:00 GMTఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.అందులో  సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమకు చేయూతనిచ్చేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి. దాని ప్రకారం 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేశారు. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ  ఛార్జీలు రద్దు చేశారు. దాని వలన నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

దీని వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. ఇక అలానే రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు కూడా ఇవ్వనున్నారు. ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు ఇవ్వనున్నారు. వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీకి  రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండనుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడనుంది. ఇక ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

మెడికల్ కాలేజీల అభివృద్ధికి 16వేల కోట్ల నిధులను..కార్పొరేషన్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఇక,   పశుసంవర్థకశాఖలో ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమగ్ర భూసర్వే చేపట్టాలని నిర్ణయించింది.  తిరుపతిలో సర్వే ట్రైనింగ్ కాలేజీ ఏర్పాటుకు 40 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం, ఇన్ పుట్ సబ్సిడీ నేరుగా RTGS ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


ఫోటో టాక్ : వావ్.. తండ్రీ, కూతురు సేమ్ టూ సేమ్..!!

బాసూ ఏంటిది.. బ్యాటింగ్ ఎలాగో రాదు.. క్యాచ్ పట్టడం కూడా రాదా..?

ఆశపడిన టెక్కీ.. నగ్నంగా వీడియో కాల్.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

కైలాస దేశానికి ఫ్రీ ఛార్టెడ్ ఫ్లయిట్..

బ్రేకింగ్: ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

నేను రాజీనామా చేసేస్తా: గద్దె రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

దూసుకొస్తున్న మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రజలు అప్రమత్తంగా కండి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>