PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/breaking-acb-kastadilo-acchanydu0d09dc57-da41-4123-b881-4249450ff0c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/breaking-acb-kastadilo-acchanydu0d09dc57-da41-4123-b881-4249450ff0c5-415x250-IndiaHerald.jpgఏపీలో టీడీపీ నేతలు ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఏపీలో టీడీపీ ఇప్పుడు స్పీడ్ గానే అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తుంది. ఇక తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ దొంగని తెలిసి కూడా ఓట్లు వేసినందుకే ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు అని ఆయన ఆరోపించారు. attcham anidu,tdp,jagan,ycp,ap;sampada;jagan;gadde rama mohan;vijayawada;telugu;scheduled caste;chief minister;mla;tdp;v;mantraవాళ్ళ బ్రతుకు కుక్కల కంటే హీనం: అచ్చెన్న సంచలన వ్యాఖ్యలువాళ్ళ బ్రతుకు కుక్కల కంటే హీనం: అచ్చెన్న సంచలన వ్యాఖ్యలుattcham anidu,tdp,jagan,ycp,ap;sampada;jagan;gadde rama mohan;vijayawada;telugu;scheduled caste;chief minister;mla;tdp;v;mantraFri, 18 Dec 2020 15:00:00 GMTటీడీపీ నేతలు ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఏపీలో టీడీపీ ఇప్పుడు స్పీడ్ గానే అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తుంది. ఇక తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ దొంగని తెలిసి కూడా ఓట్లు వేసినందుకే ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు అని ఆయన ఆరోపించారు.

తెదేపా హయాంలో అభివృద్ధి-సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలపై ఎలాంటి పన్ను వేయలేదు అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేతకాని దద్దమ్మ కాబట్టే సంపద సృష్టించటం చేతకాక ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారు అని మండిపడ్డారు. జుట్టు మీద తప్ప అన్నింటిపైనా ప్రజలపై పన్నుల భారం మోపారు అని ఆయన ఆరోపించారు. ఏలూరు వింత వ్యాధి ఘటనకు ఇంతవరకు మూలాలు కూడా చెప్పలేని అసమర్ధ ముఖ్యమంత్రి అని ఆయన ఆరోపణలు చేసారు. ఎన్నికలకు కరోనా కారణం చెప్తున్న సీఎం నిన్న వేలాదిమంది తో ఎందుకు సభ నిర్వహించారు అని నిలదీశారు.

బీసీలకు ఏం ఉద్ధరించారని బీసీల సభ పెట్టారు అని నిలదీశారు. బీసీలకు తీరని అన్యాయం చేశారనే దానిపై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తున్నా అన్నారు. జగన్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు కుక్కలకంటే హీనంగా బతుకుతున్నారు అని ఆయన విమర్శించారు. తప్పు చేసే ప్రతి ఒక్కరి చిట్టా రాస్తున్నాం అని, మళ్లీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేసారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. అవసరాల కోసం పార్టీలు మరేవారికి  ఈసారి తెలుగుదేశం లో చోటు ఉండదు అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎస్సీ వికలాంగులకు మోటార్ వాహనాలు ఆయన పంపిణీ చేసారు.


ఏప్రిల్ లో ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..!!

చిరంజీవితో నటించనన్న రాములమ్మ.. కారణం ఏంటంటే!

చిరంజీవి నటించిన ఆ సినిమా హాలీవుడ్ లో కాపీ కొట్టారా..?

సొంత పార్టీ కార్యకర్తల భూములనే కబ్జా చేసిన వైసీపీ నేత..

మన స్టార్ హీరోస్ ఎంత మంది ముసలి పాత్రలు చేసారో తెలుసా..?

వరుస మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్

దిల్ రాజు పార్టీ లో మెరిసిన టాలీవుడ్ ప్రముఖులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>