MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk638d674d-d766-4d41-ae04-45d67e50e9b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk638d674d-d766-4d41-ae04-45d67e50e9b7-415x250-IndiaHerald.jpgఅజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత జనసేన పార్టీని స్థాపించి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసాడు. ఇక ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. 'వకీల్ సాబ్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లగా నటిస్తున్నారు. ప్రస్తpspk;pawan;venkatesh;rana;ananya pandey;boney kapoor;ananya;anjali;kalyan;pawan kalyan;sriram;thaman s;trivikram srinivas;janasena;cinema;december;producer;september;remake;good news;producer1;daggubati venkateswara rao;nivetha thomas;pink;agnyaathavaasi;janasena party;venu sreeram;good newwz;dil;ananya nagalla;coronavirusపవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తోంది..!!పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తోంది..!!pspk;pawan;venkatesh;rana;ananya pandey;boney kapoor;ananya;anjali;kalyan;pawan kalyan;sriram;thaman s;trivikram srinivas;janasena;cinema;december;producer;september;remake;good news;producer1;daggubati venkateswara rao;nivetha thomas;pink;agnyaathavaasi;janasena party;venu sreeram;good newwz;dil;ananya nagalla;coronavirusFri, 18 Dec 2020 20:00:00 GMTఅజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత జనసేన పార్టీని స్థాపించి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసాడు. ఇక ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.   బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. 'వకీల్ సాబ్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.'వకీల్ సాబ్' మూవీలో వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించే లాయర్‌లా నటిస్తున్నాడు పవన్ కల్యాణ్.వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది.

 దీంతో సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అవలేదు. నిజానికి పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా గత సెప్టెంబర్ 2నే దీన్ని వదులుతారని అనుకున్నా.. అలా జరగలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ సినిమా టీజర్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'వకీల్ సాబ్' టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్ కూడా అయిపోయిందని అంటున్నారు. అలాగే, థమన్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసి ఇచ్చేశాడట.

దీంతో ఈ సారి టీజర్ రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు..ఇక ఈ సినిమా తర్వాత మలయాళ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియం రీమేక్ లో నటించనున్నాడు పవన్. సాగర్. కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడు...ఇక పవన్ తో పాటు మరో పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి..కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది...!!


ప్రశాంత్ నీల్ తో మహేష్.. డీప్ డిస్కషన్స్..!

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>