PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-palsmac4a54705-8998-4f49-b36d-9c77db9a9448-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-palsmac4a54705-8998-4f49-b36d-9c77db9a9448-415x250-IndiaHerald.jpgకోవిడ్ పేరుతో హైదరాబాద్ లో జరిగిన మరో దారుణం వెలుగు చూసింది. కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితునికి.. నాన్‌ కోవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన ప్లాస్మాను విక్రయించిన ఘటన వెలుగు చూసింది. తీరా ఈ విషయం బంధువులకు తెలియడంతో సంబంధిత రక్తనిధి కేంద్రంలో ఆందోళనకు దిగారు. రక్తనిధి కేంద్రం నిర్వాహకులు చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.covid palsma;hyderabad;rbi;police;sri venkateswara swamy;bank;secunderabad;central government;malakpetకోవిడ్ బాధితుడికి నాన్‌ కోవిడ్‌ వ్యక్తి ప్లాస్మా! బయటపడిన బ్లడ్ బ్యాంక్ మోసంకోవిడ్ బాధితుడికి నాన్‌ కోవిడ్‌ వ్యక్తి ప్లాస్మా! బయటపడిన బ్లడ్ బ్యాంక్ మోసంcovid palsma;hyderabad;rbi;police;sri venkateswara swamy;bank;secunderabad;central government;malakpetFri, 18 Dec 2020 19:41:58 GMTహైదరాబాద్ లో జరిగిన మరో దారుణం వెలుగు చూసింది. కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాధితునికి.. నాన్‌ కోవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన ప్లాస్మాను విక్రయించిన ఘటన  వెలుగు చూసింది. తీరా ఈ విషయం బంధువులకు తెలియడంతో సంబంధిత రక్తనిధి కేంద్రంలో  ఆందోళనకు దిగారు. రక్తనిధి కేంద్రం నిర్వాహకులు చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెహిదీపట్నంకు చెందిన ఒకరు కోవిడ్‌ బారిన పడ్డారు. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఆయనకు ప్లాస్మా చికిత్స చేయాలని సూచించారు. దీంతో బంధువులు నల్లగొండ క్రాస్‌రోడ్డులోని బాలాజీ బ్లడ్‌బ్యాంక్‌ను ఆశ్రయించారు. అయితే నిర్వాహకులు నాన్‌కోవిడ్‌ దాత నుంచి సేకరించిన ప్లాస్మాను కోవిడ్‌ బాధితునికి విక్రయించారు. ఇందుకు రూ.18 వేలు ఛార్జీ చేశారు.  బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకులు ఇచ్చిన ప్లాస్మాను తీసుకెళ్లి చికిత్స చేస్తున్న ఆస్పత్రి వైద్యులకు ఇచ్చారు. రోగికి ప్లాస్మాను ఎక్కించే ముందు ఆస్పత్రి వైద్యులు పరీక్షించగా ఇందులో యాంటిబాడీస్‌ లేనట్లు గుర్తించారు. నాన్‌ కోవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన రక్తం నుంచి వేరు చేసిన సాధారణ ప్లాస్మాగా తేల్చారు.

         ఈ విషయం తెలిసిన బంధువులు బ్లడ్‌బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్‌ మీడియాలో వదలడంతో అది కాస్తా వైరలైంది. బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకుడిపై బాధితులు చాదర్‌ఘట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు బ్లడ్‌బ్యాంక్‌లో తనిఖీలు నిర్వహించారు. బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేసిన దాతలు, వీరిలో ఎంత మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఉన్నారు? ఏ ఆస్పత్రిలోని రోగికి, ఎన్ని యూనిట్ల ప్లాస్మా విక్రయించారు? అనే అంశాలపై సమాచారం సేకరించమేగాకుండా.. కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇదే బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకుడు మియాపూర్‌, సికింద్రాబాద్‌, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో మరో ఆరు బ్లడ్‌ బ్యాంకులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.





ప్రశాంత్ నీల్ తో మహేష్.. డీప్ డిస్కషన్స్..!

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>