Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajini-kanth035ec48e-4009-4fe1-aac5-d7801eb94878-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajini-kanth035ec48e-4009-4fe1-aac5-d7801eb94878-415x250-IndiaHerald.jpgరజనీ కాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారో లేదో.. ఆయన చుట్టూ వ్యూహం బిగుస్తోంది. ఇంకా పార్టీ పేరు, గుర్తును కూడా అధికారికంగా ప్రకటించలేదు. అప్పుడే ఆయన మెడకు పాత కేసులు చుట్టుకుంటున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఘటనకు సంబంధించి రజినీ పోలీసులకు..rajini kanth;rajinikanth;rajani kanth;police;collector;car;copper;office;partyరజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..rajini kanth;rajinikanth;rajani kanth;police;collector;car;copper;office;partyFri, 18 Dec 2020 20:54:00 GMTరజనీ కాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారో లేదో.. ఆయన చుట్టూ వ్యూహం బిగుస్తోంది. ఇంకా పార్టీ పేరు, గుర్తును కూడా అధికారికంగా ప్రకటించలేదు. అప్పుడే ఆయన మెడకు పాత కేసులు చుట్టుకుంటున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఘటనకు సంబంధించి రజినీ పోలీసులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు కూడా అప్పట్లో నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆ తరువాత ఆయన తన వ్యాఖ్సలను వెనక్కి తీసుకున్నారు. పోలీసుల చర్యనే సమర్థించారు. కానీ అప్పటి కేసు మాత్రం ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

డిసెంబ‌ర్ 31న పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని తలైవా రజనీకాంత్ ప్రకటించారు. అలాగే జ‌న‌వ‌రిలో పార్టీని ప్రారంభిస్తాన‌న్నారు. ఈ లోగానే ఆయనకు 2018 నాటి స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ సంఘటనకు సంబంధించిన నోటీసులు మళ్లీ జారీ అయ్యాయి. తూత్తూకూడిలోని వేదాంత ఇండస్ట్రీస్‌కు చెందిన స్టైరిలైట్ కాపర్ మెల్టింగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అప్పట్లో తీవ్ర ఆందోళనలు జరిగాయి.  ఈ ఆందోళన కారులు కలెక్టర్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది నిరసనకారులు మరణించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జ‌డ్జీ అరుణ్ జ‌గ‌దీశ‌న్ ఆధ్వ‌ర్యంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ ఘటనపై రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కారులవైపు మాట్లాడారు. దీంతో ఆయనకు కూడా అప్పట్లో నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తూత్తుకుడికి వెళ్లిన ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పోలీసుల వైపే మాట్లాడారు. వ్యాఖ్య‌లు మార్చుకున్నందుకు ర‌జినీ విమర్శ‌ల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఆయ‌న మార్చుకున్న త‌న వ్యాఖ్య‌ల‌పైనే నిల‌బడ్డారు. అయితే అప్పటికే నోటీసులు జారీ కావడంతో అప్పటినుంచి విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసుకు సంబంధించిన స‌మ‌న్లు అందుకున్న‌ప్ప‌టికీ ర‌జినీకాంత్ వ్య‌క్తిగ‌త మిన‌హాయింపు కోరారు. ఆ తరువాత కరోనా వ్యాప్తితో ఈ కేసు విచారణ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో కమిషన్ మళ్లీ విచారణలో వేగం పెంచింది. ఈ నేప‌థ్యంల ర‌జినీకాంత్‌ మ‌రోసారి స‌మన్లు అందుకున్నారు. పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో ఈ నోటీసులపై రజినీకాంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


బిగ్ బాస్ 4 : గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ను అలా ఫిక్స్ చేసిన నాగ్..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?

ఏజ్ బార్ హీరోల మీద హాట్ కామెంట్స్...తట్టుకోలేరూ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>