MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali3829d2e1-60d2-499d-abe5-e644f6a8c6b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali3829d2e1-60d2-499d-abe5-e644f6a8c6b5-415x250-IndiaHerald.jpgలెస్బియన్స్.. ఈ టాపిక్ భారతీయ సినీ ఇండస్ట్రీలో అంటరానిదిగా మిగిలిపోయింది. ఈ పాత్రల్లో నటించడానికి దాదాపు ఏ స్టార్ హీరోయినూ అంగీకరించదు. ఎందుకంటే ఇలాంటి పాత్రలు చేయడం వల్ల తమ కెరీర్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువని ఈ తారలు ఫీలవుతారు. anjali;prakash raj;simran bagga;anjali;raj;tara;netizens;kanna lakshminarayana;vijay kumar naidu;hollywood;episode;audience;heroine;romantic;indian;nijam;telugammayi;vignesh shivan;sai pallavi;net flixలెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!లెస్బియన్‌గా హీట్ పెంచిన తెలుగమ్మాయి.. దేశం మొత్తం ఇదే హాట్ టాపిక్!anjali;prakash raj;simran bagga;anjali;raj;tara;netizens;kanna lakshminarayana;vijay kumar naidu;hollywood;episode;audience;heroine;romantic;indian;nijam;telugammayi;vignesh shivan;sai pallavi;net flixFri, 18 Dec 2020 22:13:15 GMTకన్నా నష్టమే ఎక్కువని ఈ తారలు ఫీలవుతారు. అందుకే ఈ తరహా సినిమాలు హాలీవుడ్ కే పరిమితం అయిపోయాయి. అయితే ప్రస్తుతం ఓటీటీల కారణంగా లెస్బియన్ కథలు మెల్ల మెల్లగా ఇండియన్ ప్రేక్షకులకు కూడా చేరువ అవుతున్నాయి. హిందీతో పాటు ఇతర ఇండియన్ భాషల్లో కూడా లెస్బియన్ కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు, సీరియల్స్ తెరకెక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో మన తెలుగమ్మాయి, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం అంజలి మాత్రం లెస్బియన్‌గా నటించి మెప్పించింది. తాజాగా విడుదలైన నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘పావా కదైగల్’లో అంజలి ఓ లెస్బియన్ పాత్రలో నటించి అదరగొట్టింది.

ప్రముఖ నటి కల్కి కోచిన్ తో అంజలి చేసిన రొమాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు నలుగురు ప్రముఖ దర్శకులు డెరెక్షన్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో కథను విభిన్నంగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో సాయి పల్లవి.. ప్రకాష్ రాజ్.. సిమ్రాన్ తదితర స్టార్లు కూడా మెరిశారు. అంజలి.. కల్కి రొమాంటిక్ ఎపిసోడ్ కు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు.


ఈ వెబ్ సిరీస్ ఓ ఎపిసోడ్‌లో అంజలి ద్విపాత్రాభినయం చేసింది. ఆ ఎపిసోడ్ మొత్తం వెబ్ సిరీస్ కు హైలైట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే దీనిలో కల్కితో అంజలి లిప్ లాక్ సీన్, బెడ్ రూం సీన్స్ ఓ లెవల్‌లో ఉన్నాయంటూ యూత్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇలాంటి పాత్రల చేయడానికి ఒప్పుకోవడం నిజంగా అంజలి ధైర్యమే అని, ఆమెకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు.


అమరావతి లో మేకప్ లు .. లిఫ్ స్టిక్ లు ! గుడివాడ కామెంట్స్ ?

రజినికాంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 2018 కేసులో..

వైష్ణవ్ తేజ్ తేజ్ సినిమా OTT కే ఖాయం..?

సినీ ఇండస్ట్రీకి బ్లాక్ మార్క్ రాసిన ఇయర్ ?

కాంగ్రెస్ వైపు ఫుల్ ఫోకస్...రేపు ఏం జరగనుంది...?

నిమ్మగడ్డ, సుజనాకు రాజకీయాలే కావాలి: ఏపీ మంత్రి

సర్కార్ వారి పాటలు ఓరేంజ్ లో బాదేస్తాడట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>